తల్లిని కావాలి.. నా భర్తకు పెరోల్ ఇవ్వండి..

* జైలులో శిక్ష అనుభవిస్తున్న హంతకుడి భార్య జిల్లా సూపరింటెండెంట్ కు వినూత్న అభ్యర్థన చేసింది.

Update: 2023-05-18 09:53 GMT

Unique Appeal: తల్లిని కావాలి.. నా భర్తకు పెరోల్ ఇవ్వండి..

Unique Appeal: జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ హంతకుడి భార్య జైలు సూపరింటెండెంట్ కు వినూత్నమైన అభ్యర్థన చేసింది. తనకు సంతానం కావాలని కాబట్టి తన భర్తను పెరోల్ పై విడుదల చేయాలని దరఖాస్తు చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... గ్వాలియర్ లోని శివ్ పురి ప్రాంతానికి చెందిన దారా సింగ్ అనే వ్యక్తికి ఏడేళ్ల క్రితం వివాహం అయింది. అయితే పెళ్లైన కొద్దిరోజులకే దారాసింగ్ ఓ హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో న్యాయస్థానం అతడికి జీవిత ఖైతు విధించింది. దీంతో అతడు గ్వాలియర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఇదిలాఉంటే, దారాసింగ్ ను పెరోల్ పై విడుదల చేయాలని అభ్యర్థిస్తూ అతడి భార్య జైలు సూపరింటెంటెండ్ కు దరఖాస్తూ చేసుకుంది. పెళ్లై ఏడేళ్లు అవుతున్నప్పటికీ.. తాను గర్భం దాల్చలేదని..తన భర్తతో కలిసి ఎక్కువ కాలం జీవించలేదని దరఖాస్తూలో వివరించింది. తాను తల్లి అయ్యేందుకు తన భర్తకు పెరోల్ ఇవ్వాలంటూ జైలు సూపరింటెండెంట్ ను వేడుకుంది. తమకు వారసులు లేరని..వారసుల కోసం కొద్ది రోజులు తన భర్తను తనతో సంసారానికి అనుమతించాలని కోరింది.

దారాసింగ్ భార్య అభ్యర్థనపై జైలు సూపరింటెండెంట్ సానుకూలంగా స్పందించారు. మహిళ దరఖాస్తును శివ్ పురి ఎస్పీకి పంపించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ జైలు నిబంధనల ప్రకారం..జీవిత ఖైదు పడిన వ్యక్తి రెండేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకుంటే అతడి సత్ప్రవర్తన ఆధారంగా పెరోల్ మంజూరు చేయొచ్చు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆమోదం తెలిపితే ఖైదీకి పెరోల్ లభిస్తుందని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. కాగా, గతంలో ఓ రాజస్తాన్ మహిళ ఇటువంటి అభ్యర్థనతోనే కోర్టును ఆశ్రయించింది. దీంతో సంతానం పొందేందుకు తనకున్న హక్కును వినియోగించుకునేందుకు జైలులో ఉన్న తన భర్తను విడుదల చేయాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ కేసులో ఖైదీకి 15 రోజులు పెరోల్ మంజూరు అయింది. 

Tags:    

Similar News