కరోనాతో గుజరాత్ ఎంపీ మృతి.. ప్రధాని మోడీ సంతాపం
దేశాభివృద్దికి పాటుపడే నాయకుడిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. న్యాయవాదిగా, ప్రజాప్రతినిధిగా అయన సేవలు చిరస్మణీయమని అన్నారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు సంతాపం. ఓం శాంతి అని మోడీ ట్వీట్ చేశారు.
కరోనా ధాటికి ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులు తమ ప్రాణాలను కోల్పోయారు. తాజాగా కరోనా కాటికి మరొకరు బలైపోయారు. గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎంపి అభయ్ భరద్వాజ్ (66) మంగళవారం రాజ్ కోట్ లోని ఓ ఆసుపత్రిలో కోవిడ్ -19 చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్నీ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తెలిపారు. అయన మృతి పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు.
దేశాభివృద్దికి పాటుపడే నాయకుడిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. న్యాయవాదిగా, ప్రజాప్రతినిధిగా అయన సేవలు చిరస్మణీయమని అన్నారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు సంతాపం. ఓం శాంతి అని మోడీ ట్వీట్ చేశారు. అభయ్ భరద్వాజ్ ఈ ఏడాది జూన్లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆగస్టులో ఆయనకి కరోనా సోకగా అయన ఇన్నిరోజులు చికిత్స పొందుతూ వచ్చారు.
అటు దేశవ్యాప్తంగా కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,69,322 పరీక్షలు నిర్వహించగా 31,118 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 94,62,810కి చేరుకుంది. తాజాగా కరోనాతో 482 మంది మృతి చెందగా, వారి సంఖ్య 1,37,621కి చేరింది. గడిచిన 24 గంటల్లో 41,985 మంది కోలుకున్నారు. 4,35,603 యాక్టివ్ కేసులున్నాయి.