కరోనాను ఓడించా : ఆలయంలో బిజెపి ఎమ్మెల్యే నృత్యం

ఆయన తన వివాదాస్పద ప్రకటనలు, చర్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ఆయన కరోనా భారిన పడి కోలుకున్నారు.. దీంతో కరోనాను..

Update: 2020-09-20 12:36 GMT

గుజరాత్‌ లో బిజెపి ఎమ్మెల్యే ఒకరు భద్రతా నియమాలను అధిగమించి ఆలయంలో డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటన వడోదరలో జరిగింది.. ఆ ఎమ్మెల్యే పేరు మధు శ్రీవాస్తవ. ఆయన తన వివాదాస్పద ప్రకటనలు, చర్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ఆయన కరోనా భారిన పడి కోలుకున్నారు.. దీంతో కరోనాను ఓడించానన్న ఆనందంలో.. వడోదర ఆలయానికి వెళ్లారు. ఆ సమయంలో తన మద్దతుదారులతో కలిసి భద్రతా నియమాలను ఉల్లంఘించి.. తాను కరోనా మహమ్మారిని ఓడించాను అంటూ డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో అతనికి ఊపు తెచ్చేందుకు మద్దతుదారులు కూడా ఎమ్మెల్యే డ్యాన్స్ ను అనుకరించారు. అంతేకాదు ఈ దృశ్యాల్ని వీడియో చిత్రీకరణ చేశారు.

దాంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఇందులో వాయిద్యం వాయించే ఇద్దరు వ్యక్తులు తప్ప ఎవరూ మాస్కు ధరించినట్లుగా లేదు. ఆలయ పూజారి కూడా మాస్కు ధరించలేదు. అయితే ఎమ్మెల్యే వ్యవహారశైలిపట్ల ఆయన ప్రత్యర్ధులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు ఫైర్ అవుతున్నారు. ఆ ఎమ్మెల్యే బాధ్యత లేకుండా ప్రవర్తించారని విమర్శించారు. అయితే ఈ విమర్శలపై సదరు ఎమ్మెల్యే స్పందించారు. తాను ప్రతి శనివారం ఇలా చేస్తానని.. గత 45 సంవత్సరాలుగా ఆలయానికి వెళుతున్నానని. ఇందులో కొత్తగా ఏమీ లేదు.. తాను ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదని వివరణ ఇచ్చారు. ఇక ఆలయంలోకి ప్రవేశించే వారు మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని కూడా మధు శ్రీవాస్తవ అన్నారు. అయితే బిజెపి సీనియర్ నాయకులు దీనిపై స్పందించడానికి నిరాకరించారు.

Tags:    

Similar News