Indian Navy: ఇండియన్ నేవీ అమ్ములపొదిలో అధునాతన మిస్సైల్ డిస్ట్రాయర్
Indian Navy: ఐఎన్ఎస్ విశాఖను జాతికి అంకితం చేసిన డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్
Indian Navy: ఇండియన్ నేవీ అమ్ములపొదిలోకి అధునాతన మిస్సైల్ డిస్ట్రాయర్ చేరిపోయింది. శత్రు దేశాల క్షిపణులకు దొరక్కుండా, వాటిని ధ్వంసం చేసే శక్తితో తయారైన ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నౌకను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించారు. ప్రాజెక్ట్-15బీలో భాగంగా నిర్మించిన ఈ నౌక స్టైల్ టెక్నాలజీతో శత్రువు కన్నుగప్పి ముందుకెళ్తుంది. ముంబైలోని నేవల్ డాక్‌యార్డులో జరిగిన కమిషనింగ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైనా డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్.. ఐఎన్ఎస్ విశాఖను జాతికి అంకితం చేశారు.
మరోవైపు.. ప్రాజెక్ట్-15బీలో భాగంగా మొత్తం నాలుగు నౌకలను నిర్మించారు. వాటికి విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ నగరాల పేర్లు పెట్టారు. అలాగే, కల్వరి క్లాస్ సబ్ మెరైన్ 'వేలా' కమిషన్ సెరిమొనీ 28న జరగనుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ హాజరుకానున్నారు.
ఇదిలా ఉంటే.. ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నౌకను జాతికి అంకితం చేసిన రాజ్‌నాథ్ సింగ్.. పాకిస్తాన్, ఆ దేశాన్ని సమర్థిస్తున్న దేశాలను తప్పుబట్టారు. పాకిస్తాన్ కుయుక్తులకు కొన్ని బాధ్యతారహితమైన దేశాలు సహకరిస్తున్నాయని చైనాపై పరోక్షంగా మండిపడ్డారు. ఇదే సమయంలో.. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో నేవిగేషన్ ఫ్రీడం, స్వేచ్ఛయుతమైన వాణిజ్యానికి భారత్ బాధ్యతాయుతంగా సహకరిస్తుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. అలాగే.. మేకిన్ ఇండియా ద్వారా నౌకలు, సబ్‌మెరైన్‌ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.