Groom Dead with Coronavirus: పెళ్లైన రెండు రోజులకే కరోనా లక్షణాలతో వరుడు మృతి.. పెళ్లికి వెళ్లిన 95 మందికి పాజిటివ్

Groom Dead with Coronavirus: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజుకు రికార్డు స్థాయిలో 18వేలపైగా న‌మోదు అవుతున్నాయి

Update: 2020-06-30 13:40 GMT

Groom Dead with Coronavirus: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజుకు రికార్డు స్థాయిలో 18వేలపైగా న‌మోదు అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల సూచన‌లు , నిబంధ‌న‌లు ప్ర‌జ‌లు అతిక్ర‌మిస్తున్నారు. తాజాగా నిబంధనలను ఉల్లంఘించి మరి ఇటీవల ఓ జంట కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వ‌రుడు వివాహం జరిగిన రెండు రోజులకే కన్నుమూశాడు. అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. వివాహానికి హాజరైన వారికి కరోనా టెస్టులు చేయ‌గా వారిలో 95 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ ఘ‌ట‌న బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే... బిహార్‌ లోని పాలిగంజ్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ టెస్టులు చేయించుకోకుండా జూన్‌ 15న పెళ్లి చేసుకున్నాడు. వివాహ అనంతరం ఆ యువకుడు, వధువుతో కలిసి స్వగ్రామం దీహ్‌పాలికి చేరుకున్నాడు. ఆ తర్వాత అతడి ఆరోగ్యం క్షీణించింది. ఈ పెళ్లి జ‌రిగిన‌ రెండు రోజులకు వరుడి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో.. పట్నాలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్తుండగా మార్గ‌ మధ్యలోనే ప్రాణాలు విడిచాడు.

వరుడు మరణించడంతో కుటుంబ సభ్యులు అతడి దహన సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విష‌యం తెలుసుకున్న‌ అధికారులకు వివాహానికి బంధువుల‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 15 మందికి పాజిటివ్‌గా తేలగా అతిథులందరికీ పరీక్షలు చేశారు. పెళ్లికి హాజరైన వారిలో 95 మంది కరోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. అయితే పెళ్లి కూతురుకి మాత్రం నెగిటివ్ రిపోర్టు వచ్చింది.

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కేవ‌లం 50 మంది మాత్రమే వివాహానికి హాజరవ్వాలన్న నిబంధనలను అతిక్రమించి వివాహ వేడుక జరిగిందన్నారు. అతిథులంద‌రూ భౌతిక దూరం పాటించ‌కుండా ఉండ‌టంతో ఎక్క‌వ సంఖ్య‌లో కేసులు వెలుగు చూసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

బీహార్‌లో క‌రోనా విజృంభ‌న కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 9,618 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 7,374 మంది కోలుకున్నారు. ఈ మ‌హమ్మ‌రి బారిన ప‌డి 65 మంది ప్రాణాలు విడిచారు. 

Tags:    

Similar News