Uttar Pradesh: కన్వర్ యాత్ర కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యూపీ ప్రభుత్వం

కోవిడ్ వేళ కన్వర్ యాత్ర ఎందుకని యూపీని ప్రశ్నించిన సుప్రీం థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో సుప్రీం అసంతృప్తి

Update: 2021-07-14 15:00 GMT

కన్వర్ యాత్ర (ఫైల్ ఫోటో)

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్రకు అనుమతి ఇవ్వడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న సమయంలో యాత్రకు ఎందుకు అనుమతించారో సమాధానం చెప్పాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సుమోటోగా సుప్రీంకోర్టు ఈ కేసును విచారించింది. కన్వర్ యాత్రలో భాగంగా ఏటా శ్రావణ మాసంలో పక్షం రోజుల పాటు శివ భక్తులు గంగా నదీ జలాలను సేకరిస్తుంటారు. కఠిన ఆంక్షల మధ్య, పరిమిత సంఖ్యలో కన్వర్ యాత్ర జరుగుతుందని యూపీ ప్రభుత్వం తెలిపింది. ఆర్టీపీసీఆర్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. వేలాది మంది భక్తులు పాల్గొనే ఆ కార్యక్రమంపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ, యూపీ ప్రభుత్వం మాత్రం తక్కువ సంఖ్య భక్తులతో వేడుకలు నిర్వహిచేందుకు అనుమతి ఇచ్చింది.

Tags:    

Similar News