BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు ఉపశమనం.. 44,720 కోట్ల పెట్టుబడులు..

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు ఉపశమనం.. 44,720 కోట్ల పెట్టుబడులు..

Update: 2022-02-05 04:00 GMT

BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు ఉపశమనం.. 44,720 కోట్ల పెట్టుబడులు.. 

BSNL: భారతీయ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) ఉద్యోగులకు ఇది శుభవార్తనే చెప్పాలి. బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వారికి తీపి కబురు అందించింది. ప్రభుత్వం 2022-23 సంవత్సరంలో రూ. 44,720 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. అందులో రూ.3300 కోట్లు ఉద్యోగుల స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం(VRS) కోసం ఉపయోగిస్తారని సమాచారం. బిఎస్‌ఎన్‌ఎల్‌లో పెట్టబోయే మొత్తాన్ని కంపెనీ 4జి స్పెక్ట్రమ్ కొనుగోలుకు వెచ్చించనుంది. దీంతో పాటు టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, పునర్నిర్మాణానికి ఖర్చు చేస్తుంది. అంతే కాకుండా GST కోసం రూ. 3550 కోట్లు బిఎస్‌ఎన్‌ఎల్‌కి చెల్లిస్తారు.

2019 అక్టోబర్‌లో కూడా భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ టెలికాం కంపెనీలకు ప్రభుత్వం 69 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసింది. తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌ను సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. బిఎస్‌ఎన్‌ఎల్‌, MTNL ప్రభుత్వ టెలికాం కంపెనీల ఉద్యోగుల కోసం VRS పథకం కింద మొత్తం రూ.7443.57 కోట్లు కేటాయించినట్లు సమాచారం.

ఈ డబ్బు బిఎస్‌ఎన్‌ఎల్‌ 4G సేవ, సంస్థ పునర్నిర్మాణం కోసం ఉపయోగిస్తారు. అప్‌గ్రేడేషన్ కోసం రూ.44,720 కోట్లతో పాటు, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం కోసం అదనంగా రూ.7,443.57 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 3,550 కోట్లు జీఎస్టీ చెల్లింపు కోసం ఉపయోగిస్తారు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కోసం అందుకున్న డబ్బు బిఎస్‌ఎన్‌ఎల్‌, MTNL రెండింటికీ ఉపయోగిస్తారు. 

Tags:    

Similar News