Ration Card: గుడ్‌న్యూస్.. రేషన్ కార్డు లేకపోయినా ఉచితంగా ఆహారధాన్యాలు..!
Ration Card: గుడ్‌న్యూస్.. రేషన్ కార్డు లేకపోయినా ఉచితంగా ఆహారధాన్యాలు..!
Ration Card: రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోంది. ఇప్పుడు అదే తరహాలో అనేక రాష్ట్రాల్లో కూడా ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్' అమలు తర్వాత, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఉచిత రేషన్ పొందుతున్నారు. ఇది కాకుండా రేషన్ కార్డులు లేనప్పటికీ యుపి, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ఉచితంగా రేషన్ ఇస్తున్నారు. ఉచిత రేషన్ పొందే పూర్తి ప్రక్రియను తెలుసుకుందాం.
ఇదిలా ఉంటే కొత్త రేషన్‌కార్డులతో పాటు పాత రేషన్‌కార్డుల్లో పేర్లు చేర్చడం, తొలగించడం వంటి పనులు కూడా దేశంలో కొనసాగుతున్నాయి. అయితే దీని కోసం మీ రేషన్ కార్డును ఆధార్ లేదా బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయడం తప్పనిసరి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-NCRలలో బ్యాంకు ఖాతా, ఆధార్‌తో అనుసంధానం చేయని రేషన్ కార్డులని హోల్డ్‌లో పెట్టారు. ఇప్పుడు వారందరు బ్యాంకుకు వెళ్లి ఈ పనిచేయడం ద్వారా మళ్లీ వారి కార్డులని యాక్టివ్ చేశారు.
'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకం కింద ఆహార ధాన్యాల పంపిణీ ఇప్పుడు అన్ని ఇ-పోస్ ద్వారా అమలు చేస్తున్నారు. దీని కింద లబ్ధిదారులు కార్డు లేకుండా కూడా ఉచిత రేషన్ పొందగలరు. అయితే దీని కోసం మీ కార్డును ఆధార్ లేదా బ్యాంకుతో లింక్ చేయడం తప్పనిసరి. ఇది కాకుండా మీ ఆరోగ్యం బాగాలేకపోతే లేదా కొన్ని కారణాల వల్ల మీరు రేషన్ దుకాణానికి వెళ్లలేకపోతే మీ కార్డుపై మరొకరు రేషన్ తీసుకోవచ్చని ఢిల్లీ ప్రభుత్వం చెప్పింది.