Ration Cardholders: రేషన్ కార్డుదారులకి శుభవార్త.. కేంద్ర ఈ పనిచేయడానికి మరింత గడువు..!
Ration Cardholders: మీరు ఇంకా రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే త్వరపడండి. ఇప్పుడు కేంద్రం మరో అవకాశాన్ని కల్పించింది.
Ration Cardholders: మీరు ఇంకా రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే త్వరపడండి. ఇప్పుడు కేంద్రం మరో అవకాశాన్ని కల్పించింది. ఇంతకుముందు రేషన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ మార్చి 31గా నిర్ణయించారు. కానీ ఇప్పుడు దానిని జూన్ 30 వరకు పొడిగించారు. దీని కోసం ఆహారం మరియు ప్రజాపంపిణీ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మీరు ఇంట్లో కూర్చొని ఆధార్‌తో రేషన్‌ను ఎలా లింక్ చేయవచ్చో తెలుసుకుందాం.
రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి తక్కువ ధరకే రేషన్ అందుతోంది. కేంద్ర ప్రభుత్వ 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకం కింద దేశంలోని లక్షలాది మంది ప్రయోజనాలు పొందుతున్నారు. రేషన్ కార్డుతో అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీరు రేషన్ కార్డ్‌తో ఆధార్ కార్డును లింక్ చేయడం ద్వారా 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకం కింద దేశంలోని ఏ రాష్ట్రంలోని రేషన్ కార్డ్ షాప్ నుంచి సరుకులని పొందవచ్చు.
ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ లింక్ చేయడం ఎలా?
1. దీని కోసం ముందుగా మీరు ఆధార్ అధికారిక వెబ్‌సైట్ uidai.gov.inకి వెళ్లండి.
2. ఇప్పుడు మీరు 'Start Now' పై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు మీరు చిరునామాను జిల్లా, రాష్ట్రంతో నింపండి.
4. ఇప్పుడు 'రేషన్ కార్డ్ బెనిఫిట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
5. ఇప్పుడు ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, ఈ-మెయిల్ చిరునామా, మొబైల్ నంబర్ మొదలైనవాటిని నింపండి.
6. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
7. ఇక్కడ OTPని పూరించిన తర్వాత మీరు మీ స్క్రీన్‌పై ప్రక్రియ పూర్తయిన మెస్సేజ్ చూస్తారు.
ఆఫ్‌లైన్ లింక్ ఎలా చేయాలి
మీకు కావాలంటే ఆఫ్‌లైన్‌లో కూడా రేషన్ కార్డ్‌తో ఆధార్ కార్డును లింక్ చేయవచ్చు. దీని కోసం మీరు రేషన్ కార్డు హోల్డర్ ఆధార్ కార్డు కాపీ, రేషన్ కార్డు కాపీ, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వంటి అవసరమైన పత్రాలను తీసుకొని రేషన్ కార్డ్ సెంటర్‌లో సమర్పించాలి. మీకు కావాలంటే మీరు రేషన్ కార్డ్ సెంటర్‌లో మీ ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ డేటా వెరిఫికేషన్‌ను పొందవచ్చు.
Also Read
Ration Card: మీకు కొత్తగా పెళ్లయిందా.. రేషన్‌కార్డుని ఇలా అప్‌డేట్ చేసుకోండి..!