Indian Railway: రైల్వే ప్యాసింజర్లకు తీపికబురు.. తగ్గిన టికెట్ ధరలు

*స్పెషల్ ట్రైన్స్ ట్యాగ్ ఉండదు *కొవిడ్ దృష్ట్యా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు..ధరల్ని పెంచిన ఇండియన్ రైల్వేస్

Update: 2021-11-21 06:03 GMT

ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్(ఫైల్ ఫోటో)

Indian Railway: ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనాకు ముందున్న చార్జీలను అమలు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి, అనవసరపు ప్రయాణాలను తగ్గించడానికి పెంచిన చార్జీలను కూడా తగ్గించనున్నారు.

తక్షణమే పాత చార్జీలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. మరోవైపు కరోనా సమయంలో ప్రత్యేక రైళ్లను నడిపిన రైల్వేశాఖ రైళ్ల నంబర్లకు ముందు సున్నా ఉండేలా చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఆ సున్నా దశలవారీగా తీసేస్తూ వారంలోపు పూర్తిస్థాయిలో సాధారణ రైళ్లు నడవనున్నాయి.

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ట్రైన్ టికెట్ ధరలు తగ్గాయి. రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. స్పెషల్ ట్రైన్స్ ఇకపై రెగ్యులర్ ట్రైన్స్ మాదిరిగానే నడుస్తాయని రైల్వే బోర్డు తెలిపింది.

దీంతో ఈ ట్రైన్స్‌లో టికెట్ ధరలు తగ్గాయి. కోవిడ్ ఉధృతి కారణంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఇండియన్ రైల్వేస్ టికెట్ ధరలను పెంచింది. అధిక టికెట్ ధరలతో స్పెషల్ ట్రైన్స్‌ను నడిపింది. అయితే ఇప్పుడు స్పెషల్ ట్రైన్స్ ట్యాగ్ ఉండదు. ఇకపై అన్ని ట్రైన్స్ రెగ్యులర్ ట్రైన్ల మాదిరే నడుస్తాయి. దీంతో టికెట్ ధరలు దిగివచ్చాయి.

కోవిడ్ సమయంలో సాధారణ రైళ్లకు సున్నాని చేర్చి స్పెషల్ రైళ్లను నడిపించారు. స్టేషన్ హల్ట్‌లను కూడా తగ్గించారు. సాధారణ రైళ్ల చార్జీలతో పోలిస్తే స్పెషల్ ట్రైన్స్ చార్జీలు 30 శాతం అదనంగా వసూలు చేసేవారు. ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

చాలా రోజుల డిమాండ్ల తరువాత కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. కరోన తగ్గిన నేపథ్యంలో సాధారణ రైళ్లను ప్రారంబిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసారు. మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఇది వర్తిస్తుందని అయితే పండుగ పూట నడిచే ప్రత్యేక రైళ్లకు మాత్రం ఈ సవరణ వర్తించదని స్పష్టం చేసింది.

ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం సాధారణ సంఖ్యలతో, సంబంధిత ప్రయాణ తరగతులకు, రైళ్లకు వర్తించే ఛార్జీలతో నిర్వహంచాలని నిర్ణయించారు. వారం రోజుల్లో పాత రైల్వే నంబర్స్‌గా మారతాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు.

సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులు, స్పెషల్‌ క్లాస్‌ ప్రయాణీకులకు కరోనాకు ముందున్న మాదిరిగానే చార్జీల్లో రాయితీలను పునరుద్ధరించనున్నట్టు కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రత్యేక రైళ్లు సాధారణ రైళ్లుగా పట్టాలెక్కిస్తుండడం శుభపరిణామం.

Tags:    

Similar News