రైతులకి గుడ్‌న్యూస్.. దీనికోసం బ్యాంకులో క్యూ కట్టనవసరం లేదు..!

రైతులకి గుడ్‌న్యూస్.. దీనికోసం బ్యాంకులో క్యూ కట్టనవసరం లేదు..!

Update: 2022-09-21 14:30 GMT

రైతులకి గుడ్‌న్యూస్.. దీనికోసం బ్యాంకులో క్యూ కట్టనవసరం లేదు..!

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు అందరికి తెలుసు. రైతులు ఈ కార్డు సహాయంతో తక్కువ వడ్డీకి రుణం పొందుతారు. ఇది అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్‌లో ఖాతా ఉన్న రైతులు మరింత సంతోషిస్తారు. ఈ రెండు బ్యాంకులు పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాయి. దీని కింద బ్యాంకులు రైతులకు డిజిటల్ పద్ధతిలో కిసాన్‌ క్రెడట్ కార్డు ఇవ్వడం ప్రారంభించాయి. వ్యవసాయ భూమికి సంబంధించిన కాగితాల వెరిఫికేషన్ కోసం బ్యాంకుకి వెళ్లనవసరం లేదు.

పైలట్ ప్రాజెక్టులు

పైలట్ ప్రాజెక్టుల కింద గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల డిజిటలైజేషన్‌పై దృష్టి సారించారు. ఈ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీంతో పాటు చెన్నైలో ఫెడరల్ బ్యాంక్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. త్వరలో ఈ సేవలు దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయని యూనియన్ బ్యాంక్ అధికారులు చెబుతున్నారు.

ప్రయోజనం ఏమిటి..?

రైతులు పూర్తి స్థాయిలో లబ్ధి పొందుతారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా రైతులు ముందుకు సాగాలని ప్రభుత్వం గతంలోనే ప్రస్తావించింది. పైలట్ ప్రాజెక్టుల కింద ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభించడంతో కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) కోసం ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ వల్ల రైతులకు సమయం ఆదా అవడంతో పాటు బ్యాంకుల్లో రద్దీ తగ్గుతుంది. రైతులు భూ పత్రాల పరిశీలన కోసం బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేదు. వ్యవసాయ భూమి పేపర్‌ను బ్యాంకు స్వయంగా ఆన్‌లైన్‌లో వెరిఫై చేస్తుంది.

Tags:    

Similar News