Gold Smuggling in India: తెలివిమీరిపోతున్న దొంగలు
Varanasi Airport: బంగారం అక్రమ రవాణా కోసం దొంగ రూట్లు. వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బంగారం
Gold Smuggling Case in India: బంగారం (gold) మీద ఉన్న ఇష్టమో లేకుంటే పసిడికి ఉన్న డిమాండో తెలియదు కానీ, ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి గోల్డ్ అక్రమ రవాణా చేస్తున్నారు. దొంగలు తెలివిమీరిపోతున్నారు. బంగారం అక్రమ రవాణా చేసేందుకు చేయని ప్లాన్స్ లేవు వేయని స్కెచ్ లేదు అధికారులకే దిమ్మతిరిగేలా దొంగల ప్లాన్స్ ఉంటున్నాయి రోజూ కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బయటపడుతున్నా వారు మాత్రం మారడం లేదు కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తీసుకెళ్లేందు ఒక మహిళ తన మెదడుకు పని చెప్పింది. చివరకు ఎయిర్‌పోర్టులో దొరికిపోయింది
వారణాసి ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బంగారం బయటపడింది. అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. నెక్లెస్ పూసల వెనుక గోల్డ్ బాల్స్ లో దాచిపెట్టి మరీ అక్రమ రవాణాకు తెర లేపింది. అంతేకాదు ప్లాస్కు, కూల్ డ్రింక్ టిన్నుల్లోనూ బంగారం రేకులను దాచింది. చివరకు కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఆమె దగ్గర నుంచి 17 లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 74వేలు విలువ చేసే ఫోన్ సీజ్ చేశారు.