Gold Rate: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్; తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా!

Gold Rate: బంగారం ధర గత రెండు రోజులుగా పెరుగుతూ ఉంది.

Update: 2021-05-05 17:36 GMT

బంగారం

Gold Rate: బంగారం ధర గత రెండు రోజులుగా పెరుగుతూ ఉంది. అయితే..బంగారం ధర పెరిగినా.. గత రికార్డ్ స్థాయి నుంచి చూస్తే.. ఇంకా దిగువ స్థాయిలోనే కదలాడుతోంది.

బంగారం ధర గత ఏడాది ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. 2020 ఆగస్ట్ నెలలో బంగారం ధర ఏకంగా రూ.56,200 స్థాయికి పరుగులు పెట్టింది. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. అప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు బంగారం 25 శాతం పడిపోయింది. కాగా గత ఏడాది బంగారం ఏకంగా 43 శాతం లాభాన్ని అందించింది.

ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర రూ.47 వేల దగ్గర కదలాడుతోంది. ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి నుంచి చూస్తే గోల్డ్ రేట్ ఇంకా రూ.9 వేలకు పైగానే తగ్గింది. బంగారం కొనాలనుకుంటే.. ఇదే మంచి సమయం.

బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా పోతోంది. వెండి ధర గత ఏడాది ఆగస్ట్ నెలలో కేజీకి రూ.79,980 స్థాయికి చేరింది. ప్రస్తుత ధరతో పోల్చితే ఏకంగా రూ.11 వేలు పతనమైంది. ప్రస్తుతం వెండి ధర రూ.69,000 వద్ద ఉంది.

Tags:    

Similar News