బంగారం ధరలు పరుగులు పెడుతోంది. సామాన్యునికి అందనంతగా రోజు రోజుక గోల్డ్ రెట్లు పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీన పడటం.. గత నెల రోజులుగా హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు దాదాపు రెండు వేల రూపాయలకు పైగా పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరిగి పది గ్రాముల బంగారం 50 వేలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు వ్యాపారులు. పెరుగుతున్న ధరలతో కొనుగోళ్లు భారీగా పడిపోతున్నట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో బంగారం ధరలు కొండెక్కాయి. అమెరికా సెంట్రల్ బ్యాంకింగ్ వ్యవస్థ వడ్డీ రేట్లను తగ్గించే సంకేతాలతో బంగారం రేట్లు రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. మరో వైపు అమెరికతో సక్యతగా లేని దేశాలు తమ పెట్టుబడులను గోల్డ్ వైపు మళ్లిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అవున్స్ బంగారం ధర 14 వందల డాలర్లను మించి పరుగులు పెడుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో 16 డాలర్లను టచ్ చేస్తే బంగారం ధరలు దేశీయంగా38 వేలకు చేరుకుంటందంటున్నాయి మార్కెట్ వర్గాలు.
నెల రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ మధ్య తరగతి వారి ఆశలపై నీళ్లు చల్లాయి. ప్రస్తుతం ఆర్నమెంట్ బంగారం ధర పది గ్రాములు 36 వేలు ఉండగా.. ఫ్యూర్ గోల్డ్ 40 వేల వరకు ఉంది. అంతర్జాతీయ డాలర్ హెచ్చు తగ్గులు ఉండటంతో బంగారం ధరలు మరింత పెరుగుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరుగుతాయని వ్యాపారవర్గాలు అంటున్నారు.
తాజాగా పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పట్లో తగ్గవంటున్నారు గోల్డ్ అనలిస్ట్ లు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ధరలు మరింతగా పెరుగుతాయని..పది గ్రాముల బంగారం 45 నుండి 50 వేలకు చేరుతుందంటున్నారు. పెరుగుతున్న బంగారం ధరలు సామాన్యులకు కష్టాలు తప్పేట్లు లేవు. కొనుగోలు చేయాలనుకున్న బంగారంలో సగం మాత్రమే కొంటున్నారు. మరో వైపు కొనుగోల్ళు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.