Gold Price: లాక్‌డౌన్లతో పెరుగుతున్న బంగారం ధరలు
Gold Price: గతవారం స్టాక్, బులియన్ మార్కెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా వెళ్తున్నాయి.
Gold Price: గతవారం స్టాక్, బులియన్ మార్కెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం మనదేశంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా వెళ్తున్నాయి. దీంతో కరోనా కేసుల పెరుగుదలకు బ్రేక్ పడుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, లాక్‌డౌన్ కాలంలో గోల్డ్‌పై పెట్టుబడి పెడితే మంచిదని, భారీగా లాభాలొస్తాయని పెట్టుబడి దారులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ తో బంగారు ఆభరణాల కొనుగోళ్లు పెరిగాయి. దీంతో గోల్ట్ ధరలు పెరుగుతున్నాయని తెలుస్తోంది.
ఈనెల 5 వరకు కాస్త తగ్గిన బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో నేడు స్వచ్చమైన 10 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.280 వరకు పెరిగింది. అలాగే మే 7న రూ.47,575గా ఉంది. నగల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల ఎల్లో మెటల్ ధర రూ.43,579 నుంచి రూ.43,834కు పెరిగింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో ధర రూ.44,610గా ఉంది. అలాగే పెట్టుబడులు పెట్టే 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర మాత్రం రూ.510 తగ్గి రూ.48,670కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ రేట్స్ ఒకేలా ఉన్నాయి. ఎల్లో మెటల్ తో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.71,073 నుంచి రూ.71,967కు చేరింది.