SBI: ఫోన్ చేయండి..డెబిట్ కార్డు పిన్ మార్చుకోండి..

State Bank of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు ఓ కొత్త ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Update: 2021-02-21 15:42 GMT

ఎస్‌బీఐ ఫోటో ట్విట్టర్ 

State Bank of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు ఓ కొత్త ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ తో ఎస్‌బీఐ ఖాతాదారులు తమ ఇంటి వద్ద నుంచే తేలికగా ఏటీఎం డెబిట్ కార్డ్ పిన్, గ్రీన్ పిన్ జనరేట్ చేసుకోవచ్చని తెలిపింది. దీని కోసం ఏటీఎం కు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న వారు ఎలాగు ఆన్ లైన్ ద్వారా పిన్ జనరేట్ చేసుకుంటారు. ఇంటర్నెట్ బ్యాకింక్ లేనివారు ఎస్‌బీఐ టోల్ ఫ్రీ ఐవీఆర్ సిస్టం ద్వారా 1800 112 211 లేదా 1800 425 3800 కాల్ చేసి మార్చుకోవచ్చు.

ఏం చేయాలంటే..

  1. కాల్ చేసిన తరువాత పిన్ (Pin) జనరేట్ చేసుకునేందుకు ఆప్షన్ 6 ఎంచుకోవాలి
  2. ఆ తరువాత ఎస్‌బీఐ కార్డు మీద ఉన్న నెంబర్, పుట్టిన తేదీ, కార్డు Expiry డేట్ ఎంటర్ చేయాలి
  3. రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు లేదా ఈ మెయిల్ ఐడీకి 6 అంకెల ఓటీపీ వస్తుంది
  4. ఓటీపీ ఎంటర్ చేశాక నాలుగు అంకెలు ఉండే పిన్ నెంబర్ ఎంచుకోవాలి, అనంతరం రీ కన్ఫామ్ చేసేందుకు మరోసారి టైప్ చేయాలి
  5. చివరికి ఐవీఆర్ లో మీ డెబిట్ కార్డు పిన్ జనరేట్ అయిందని నిర్దారణ మెస్సేజ్ వస్తుంది
Tags:    

Similar News