గ్యాస్‌ వినియోగదారులు అలర్ట్.. వారికి మాత్రమే సబ్సిడీ ప్రయోజనం..!

గ్యాస్‌ వినియోగదారులు అలర్ట్.. వారికి మాత్రమే సబ్సిడీ ప్రయోజనం..!

Update: 2022-03-21 11:30 GMT

గ్యాస్‌ వినియోగదారులు అలర్ట్.. వారికి మాత్రమే సబ్సిడీ ప్రయోజనం..!

LPG Subsidy: ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీకి సంబంధించి వినియోగదారులు ప్రతిరోజు రకరకాల వార్తలని వింటున్నారు. వాస్తవానికి వంట గ్యాస్‌ ధరని పెంచుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కారణం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధర పెరిగిందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం 1000లోపు ఉండగా.. యుద్ద కారణంగా ఇది మరింత పెరుగుతుందనే చర్చ జోరుగా సాగుతోంది.

పెరుగుతున్న ఎల్పీజీ సిలిండర్ల ద్రవ్యోల్బణానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ అంతర్గత సమాచారం ప్రకారం వినియోగదారులు గ్యాస్‌ సిలిండర్ కోసం 1000 రూపాయల వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తోంది. వాస్తవానికి ఎల్పీజీ సిలిండర్ల విషయంలో ప్రభుత్వం రెండు పద్దతులు పాటించవచ్చు. అందులో ఒకటి సబ్సిడీ లేకుండా సిలిండర్లను సరఫరా చేయాలి. రెండోది కొంతమంది ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనం కల్పించాలి.

నిజానికి ఎల్పీజీ సబ్సిడీ ఇవ్వడంపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రూ.10 లక్షల ఆదాయం అనే నిబంధన అమలులో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఉజ్వల పథకం లబ్ధిదారులు మాత్రం కచ్చితంగా సబ్సిడీ ప్రయోజనం పొందుతారని ప్రభుతం మొదటి నుంచి చెబుతోంది. మిగిలిన వ్యక్తులకు సబ్సిడీ ప్రయోజనం ఉండకపోవచ్చు. మీడియా నివేదికల ప్రకారం ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ఎల్పీజీ సబ్సిడీ తిరిగి ప్రారంభించింది.

2021 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీలపై ప్రభుత్వం చేసిన వ్యయం రూ.3,559గా ఉంది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం రూ.24,468 కోట్లు. వాస్తవానికి ఇది జనవరి 2015లో ప్రారంభించబడిన DBT పథకం కింద సబ్సిడి ప్రయోజనం కల్పిస్తున్నారు. దీని కింద వినియోగదారులు మొదట సిలిండర్ పూర్తి మొత్తాన్ని చెల్లించాలి. తర్వాత సబ్సిడీ డబ్బును ప్రభుత్వం కస్టమర్ బ్యాంక్ ఖాతాకు తిరిగి చెల్లిస్తుంది. 

Tags:    

Similar News