Gas‌ Consumers: గ్యాస్‌ వినియోగదారులు అలర్ట్‌.. మీ అకౌంట్లో సబ్సిడీ డబ్బులు పడుతున్నాయా..!

Gas‌ Consumers: మీరు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్‌ చేసుకున్నప్పుడు మీ అకౌంట్లో సబ్సిడీ డబ్బులు పడుతున్నాయా..

Update: 2022-02-28 04:32 GMT

Gas‌ Consumers: గ్యాస్‌ వినియోగదారులు అలర్ట్‌.. మీ అకౌంట్లో సబ్సిడీ డబ్బులు పడుతున్నాయా..!

Gas‌ Consumers: మీరు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్‌ చేసుకున్నప్పుడు మీ అకౌంట్లో సబ్సిడీ డబ్బులు పడుతున్నాయా.. ఒకవేళ పడితే ఎంత పడుతున్నాయి.. వాస్తవానికి ప్రభుత్వ కంపెనీలు గ్యాస్ సబ్సిడీని చాలావరకు తగ్గించేసాయి. గత తొమ్మిది నెలల కాలంలో కంపెనీలు చెల్లించిన గ్యాస్ సబ్సిడీ కేవలం రూ.2,706 కోట్లు మాత్రమే. ఈ సబ్సిడీ 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.37,585 కోట్లుగా ఉన్నట్టు ఆర్‌టీఐ ఎంక్వయిరీలో వెల్లడైంది.

నెలనెలకి ఎల్పీజిపై రేట్లు పెంచుతున్న ప్రభుత్వం సబ్సిడీ మాత్రం తగ్గించుకుంటుంది. ప్రస్తుతం వంటగ్యాస్‌ను 39 కోట్ల మందికి పైగా వాడుతున్నారు. గ్లోబల్‌గా ఆయిల్, గ్యాస్ ధరలు తగ్గినపపుడు కూడా ప్రభుత్వం ధరలను పెంచుతూ పోయింది. ప్రస్తుతం ఫ్యూయల్ ధరలు ఆకాశాన్నంటి కూర్చున్నాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ద ప్రభావాన్ని అడ్డు పెట్టుకొని ఎంత పెంచుతాయోనని కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు.

గత ఐదేళ్లలో సిలిండర్ ధరలు విపరీతంగా పెరిగాయి. సబ్సిడీని మాత్రం పూర్తిగా తగ్గించేసింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర సుమారు రూ.900 పలుకుతోంది. కానీ సబ్సిడీ మాత్రం రూ.40.10 మాత్రమే. దారిద్రరేఖకి దిగువన ఉన్న ప్రజలు ఇంత మొత్తం చెల్లించలేకపోతున్నారు. గ్యాస్ ధరలు ఈ విధంగా పెంచుతూ పోతు ఉంటే ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌లు అందించినా వృథా ప్రయాస మాత్రమే. చాలామంది నిరుపేదలు మొదటి సిలిండర్ వాడిన తర్వాత అధిక ధరలకి భయపడి గ్యాస్‌ బండని పక్కన పడేసారు.

చివరికి మళ్లీ కట్టెల పొయ్యిపైనే వండుతున్నారు. కంపెనీల వారీగా ఇప్పటివరకు చెల్లించిన సబ్సిడీలను చూసుకుంటే.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) 2021-22 తొలి తొమ్మిది నెలల్లో రూ.1,369 కోట్లను, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ రూ.716 కోట్లను, బీపీసీఎల్ రూ.621 కోట్లను మాత్రమే సబ్సిడీగా చెల్లించాయి.

Tags:    

Similar News