Vande Bharat Express: వందే భారత్‌ రైళ్లలో క్లీనింగ్‌ ప్రక్రియ మార్పు.. ఇకపై సీటు దగ్గరే చెత్త సేకరణ

Vande Bharat Express: శుభ్రపరిచే విధానాన్ని మార్చేస్తున్నట్టు ప్రకటించిన అశ్విని వైష్ణవ్

Update: 2023-01-30 01:52 GMT

Vande Bharat Express: వందే భారత్‌ రైళ్లలో క్లీనింగ్‌ ప్రక్రియ మార్పు.. ఇకపై సీటు దగ్గరే చెత్త సేకరణ

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో క్లీనింగ్ పద్ధతిని మార్చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. రైలు బోగీ మొత్తం చెత్తచెత్తగా మారిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంపై ఆయన స్పందించారు. వందే భారత్ రైలును పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్త తొలగించే పద్ధతిని మార్చేశామన్నారు. ఈ కొత్త పద్ధతికి ప్రజల సహకారం కావాలని వైష్ణవ్ కోరారు. మెయింటనెన్స్ సిబ్బంది చెత్త బుట్టతో ప్రయాణికుల సీటు వద్దకే వచ్చి వాటర్ బాటిల్స్, టీ కప్పులు, ఆహార పదార్థాల కవర్లు.. తదితరాలను తీసుకెళతారని ఆయన వివరించారు. ప్రస్తుతం విమానాలలో ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారని, ఇకపై వందే భారత్ లోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తామని వైష్ణవ్ వెల్లడించారు. ఆహార పదార్థాలు తినేశాక మిగిలిన వాటిని బోగీలోనే పడేయకుండా పక్కన పెట్టి, మెయింటనెన్స్ సిబ్బంది వచ్చాక ఆ చెత్త బుట్టలో పడేయాలని కోరారు. ఈ కొత్త పద్ధతి అమలు చేస్తే ఎలా ఉండబోతోందో చెబుతూ కేంద్ర మంత్రి ఓ వీడియోను ట్వీట్ చేశారు.

Tags:    

Similar News