Ganga Pushkaralu 2023: నేటి నుంచి ప్రారంభంకానున్న గంగానది పుష్కరాలు

Ganga Pushkaralu 2023: ‌హరిద్వార్‌, బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ సంగమ నగరాలలో పుష్కర శోభ

Update: 2023-04-22 05:52 GMT

Ganga Pushkaralu 2023: నేటి నుంచి ప్రారంభంకానున్న గంగానది పుష్కరాలు

Ganga Pushkaralu 2023:  పుష్కర కాలానికి ఒకసారి వచ్చే అతిపెద్ద పండుగ గంగా నది పుష్కరాలు నేటినుండి ప్రారంభంకానున్నాయి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయి. అలహాబాద్‌, గంగోత్రి, గంగాసాగర్‌, హరిద్వార్‌, బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ సంగమం ప్రయాగ నగరాలలో పుష్కరాల నేటినుంచి పుష్కర శోభ సంతరించుకోబోతుంది.

పుష్కరాల సమయంలో ఆయా నదుల్లో స్నానమాచరిస్తే సకల పాపాల నుంచి విముక్తమవుతామని ప్రతీతి. ఈ సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారని చెప్తారు. రోజుకు 25 లక్షల దాకా జనం గంగా స్నానం ఆచరిస్తారు. కనీసం కోటి మంది నిత్యం పూజలోనో, వ్రతంలోనో, యజ్ఞంలోనో, పితృకార్యంలోనో గంగను తలుచుకుంటుంటారు. గంగానది పుట్టింది మొదలు సముద్రంలో కలిసే దాకా ప్రతీది భారతీయులకు పవిత్రం. గంగా ఒడ్డున ఎన్నో నాగరికతలు పుట్టాయి. మరెన్నో సామ్రాజ్యాలు వెలిశాయి.

గంగానదికి చాలా పేర్లున్నాయి. భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భాగీరథి అంటారు. జహ్ను పొట్టంలోంచి పుట్టింది కాబట్టి జాహ్నవిగా కూడా పిలుస్తారు. భారతీయులు ఒక్కసారైనా మునిగి తీరాలనుకునే గంగా ప్రధానమైనది. కాశీనాథుడు కొలువుదీరిన పవిత్ర వారణాసి క్షేత్రంలో గంగాపుష్కర స్నానానికి 64 స్నాన ఘాట్‌లు ఉన్నాయి. అన్నింటిలోకి మణికర్ణిక ఘాట్‌ ముఖ్యమైనది. బృహస్పతి మీనరాశిలో ప్రవేశించినప్పడు అంటే 2023, మే 3న గంగానది పుష్కరాలు ముగుస్తాయి.

పుష్కరాలకు వెళ్లాలనుకునే తెలుగువారికి కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ రైళ్లు ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్, ప్రయాగ్‌రాజ్, వారణాసి మీదుగా రక్సోల్ వరకు ఒక ప్రత్యేక రైలు నడపున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది.

Tags:    

Similar News