Nayab Singh Saini:కంప్యూటర్ ఆపరేటర్ నుంచి ముఖ్యమంత్రి వరకు హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ రాజకీయ ప్రస్థానం ఇదే

Nayab Singh Saini Political Career : ప్రతికూల పరిస్థితుల్లోనూ పార్టీని ముందుండి విజయవంతంగా నడిపించారు నయాబ్ సింగ్ సైనీ. కేవలం రెండు వందల రోజుల్లోనే ఎన్నో సవాళ్లను అధిటమించి నేడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ నుంచి హర్యానా ముఖ్యమంత్రి వరకు సాగిన సైనీ రాజకీయ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

Update: 2024-10-09 02:02 GMT

 Nayab Singh Saini:కంప్యూటర్ ఆపరేటర్ నుంచి ముఖ్యమంత్రి వరకు హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ రాజకీయ ప్రస్థానం ఇదే

Nayab Singh Saini Political Career : నయాబ్ సింగ్ సైనీ...మాస్ లీడర్ కాదంటూ రాజకీయ విశ్లేషకులు ఆయన గురించి చాలా తక్కువగా అంచనా వేశారు. డమ్మీ ముఖ్యమంత్రి అంటూ ప్రతిపక్ష నేతలు పగబట్టి విమర్శించారు. ఓటమి అంచున ఉన్న బీజేపీని గెలిపించడం అసాధ్యం అన్నారు సొంతపార్టీలోనే కొంతమంది నేతలు. అగ్నివీరులు, నిరుద్యోగులు ఇతర వర్గాల ఆగ్రహం..అధిక ధరలు వంటి సమస్యలు చుట్టుముట్టాయి. పదేండ్లుగా అధికారంలో ఉన్న పార్టీకి గెలుపు అవకాశాలు లేవని కొట్టిపారేశారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ కేవలం 200 రోజుల్లో పార్టీని విజయపథంలోకి తీసుకువచ్చి మ్యాజిక్ చేశారు నాయబ్ సింగ్ సైనీ.

నాయబ్ సింగ్ సైనీ రాజకీయ ప్రస్థానం:

హర్యానాలోని అంబాలా జిల్లా మిర్జాపూర్ మజ్రా గ్రామంలో 1975 జనవరి 25న జన్మించారు సైనీ. బీఏ, ఎల్ఎల్ బీ చేశారు. ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉంది. బీజేపీ కార్యకర్త స్థాయి నుంచి దిగుతూ వచ్చారు. 1996లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా సైనీ తన జీవితాన్ని మొదలుపెట్టారు. మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తో సాన్నిహిత్యమే రాజకీయ జీవితంలోకి వేగంగా ఎదిగేలా బాటలు వేసింది.

అంబాలా జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా, బీజేపీ కిసాన్ మోర్చా హర్యానా శాఖ ప్రధాన కార్యదర్శిగా సైనీ పలు స్థాయిల్లో సేవలు అందించారు. మనోహర్ లాల్ ఖట్టర్ కేబినెట్లో హోంమంత్రిగా కూడా పనిచేశారు. 2014లో అసెంబ్లీకి నారాయణ్ గఢ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2019లో కురుక్షేత్రం నుంచి ఎంపికా ఎన్నికయ్యారు. 2023 అక్టోబర్ లో హర్యానా బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు సైనీ.

అయితే ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. అది గమనించిన బీజేపీ అధిష్టానం ఈ ఏడాది మార్చిలో సైనీకి సీఎం బాధ్యతలను అప్పగించింది. ఆ తర్వాత రెండున్నర నెలలకే లోకసభ ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకూ సుమారు 200రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో సైనీ వేగంగా ప్రజాకర్షక పథకాలపై ఫోకస్ పెట్టారు.

భారీగా ఉద్యోగనోటిఫికేషన్లు, గ్రామపంచాయితీ వ్యయపరిమితిని పెంచడం, క్షేత్రస్థాయిలో అభివ్రుద్ధి, విద్యుత్ వినియోగదారులకు భారంగా కనీస ఛార్జీలను రద్దు చేయడం, అగ్నీవీర్ పాలసీ తీసుకురావడం..ఇవన్నీ కూడా ప్రజలను ఆకట్టుకున్నాయి. ప్రచారంలో మోదీ తక్కువగానే పాల్గొన్నప్పటికీ బాధ్యతలన్నింటిని సైనీ తన భుజానీకేసుకుని ముందుకు సాగారు.


Tags:    

Similar News