Top 6 News @ 6 PM: కోర్టుకు నాగార్జున వాంగ్మూలం.. హర్యానా, కశ్మీర్ ఎన్నికల ఫలితాలు.. మరో టాప్ 4 న్యూస్ హెడ్‌లైన్స్
1) Nagarjuna: కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకొండి.. కోర్టుకు నాగార్జున వాంగ్మూలం
నాంపల్లి కోర్టుకు హీరో నాగార్జున హాజరయ్యారు. నాగార్జున వెంట న్యాయవాది, నాగచైతన్య, అమల కూడా ఉన్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ పిటిషన్ వేసిన నాగార్జున ఇవాళ వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు వచ్చారు. సాక్షులు సుప్రియ, వెంకరటేశ్వర్లు కూడా కోర్టుకు హాజరయ్యారు.
కోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ.. ఎందుకు పిటిషన్ దాఖలు చేశారని నాగార్జునను ప్రశ్నించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, అన్ని టెలివిజన్ ఛానళ్లు, పత్రికల్లో ఆ వ్యాఖ్యలు వచ్చాయని తెలిపారు. అసత్య ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు. నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డు చేసింది.
2) Azharuddin: ఈడీ విచారణకు హాజరైన అజహరుద్దీన్
అజహారుద్దీన్ మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో అక్రమాలపై నమోదైన కేసులో ఆయన ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.
ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ బాల్స్, జిమ్ పరికరాలు, సీట్లు, ఫైర్ కిట్లు, ఇతర సామాగ్రి కొనుగోలు విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీని ఆధారంగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తనపై తప్పుడు ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అజహారుద్దీన్ చెప్పారు. ఈడీ విచారణకు హాజరయ్యే సమయంలో ఆయన మీడియా ప్రతినిధులకు ఈ విషయం చెప్పారు.
3) Haryana Election Result: రెజ్లర్ వినేష్ ఫొగాట్ విజయం
హర్యానా అసెంబ్లీ ఎన్నికలో భారత మాజీ రెజ్లర్ వినేష్ పొగట్ విజయం సాధించారు. హర్యానలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అధ్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రతి రౌండ్ కు ఆధిక్యాలు మారుతుండటంతో విజయం చివరి వరకు దోబుచూలాడీంది. కాంగ్రెస్ తరపున జులానా అసెంబ్లీ నియోజకవర్గంనుంచి బరిలోకి దిగిన భారత మాజీ స్టార్ రెజ్లర్ వినేష్ పొగట్ తన సమీప బీజేపీ అభ్యర్ధి యోగేష్ కుమార్ పై విజయం సాధించింది. అంతకు ముదు ఆమె రెండు వేల ఓట్ల వెనుకంజలో ఉన్న తరుణంలో పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. అనూహ్యంగా ఆ తర్వాత రౌండ్ లో పొగట్ తిరిగి పుంజకుని విజయం సాధించింది. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్ధి యోగేష్ కుమార్, మూడో స్తానంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అబ్యర్ధి సురేందర్ లాతర్ ఉన్నారు.
4) Haryana Election Results 2024: ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు తలకిందులు.. హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటి అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 51 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అంబాలా లో పార్టీ జెండాలను చేతపట్టుకుని డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. మిఠాయిలు తినిపించుకున్నారు. కొన్ని చోట్ల బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. అనూహ్యంగా కమలం పుంజుకుని ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తోంది.
మరోవైపు జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోంది.
5) PM Kisan: పీఎం కిసాన్ 18వ విడత డబ్బు జమ కాలేదా..అయితే వెంటనే ఇలా చేయండి
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీం 18వ విడతను అక్టోబర్ 5, 2024న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ఫిబ్రవరి 2019లో ప్రారంభించిన ప్రభుత్వం అర్హులైన రైతులకు ప్రతి ఏడాది విడతలవారీగా రూ. 2వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే కొందరు రైతులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ 18వ విడత ఇన్ స్టాల్ మెంట్ జమ కాలేదు. అయితే అలాంటి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. పలు కారణాల వల్ల ఆలస్యం జరిగి ఉండవచ్చు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మీ ప్రయోజనాలను తిరిగి పొందేందుకు ప్రాసెస్ ఉంది. అదేంటో చూద్దాం. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) Iran-Israel: ఇరాన్ అణు బాంబును పరీక్షిస్తోందా? ఇరాన్-ఇజ్రాయెలో సంభవించిన భూకంపమే సాక్ష్యమా?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ఇరాన్ మరింత ఆజ్యం పోస్తుందా? అందులో భాగాంగానే తాజాగా అణు పరీక్షలు నిర్వహించిందా? అక్టోబర్ 5వ తేదీ శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపు ఒకే సమయంలో భూకంపం సంభవించడం ఈ అనుమానాలకు మరింత తావిస్తోంది. స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 10.45 నిమిషాలకు ఇరాన్ లోని అరదాన్ నగర సమీపంలో సంభవించిన భూకంపం తీవ్రత 4.5గా నమోదు అయ్యింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.