PM Kisan: పీఎం కిసాన్ 18వ విడత డబ్బు జమ కాలేదా..అయితే వెంటనే ఇలా చేయండి
PM Kisan: ఈమధ్యే పీఎం కిసాన్ 18వ విడత డబ్బులు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అర్హత ఉన్నా ఈ ఆర్థిక సాయం అందని రైతులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీం 18వ విడతను అక్టోబర్ 5, 2024న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ఫిబ్రవరి 2019లో ప్రారంభించిన ప్రభుత్వం అర్హులైన రైతులకు ప్రతి ఏడాది విడతలవారీగా రూ. 2వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే కొందరు రైతులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ 18వ విడత ఇన్ స్టాల్ మెంట్ జమ కాలేదు. అయితే అలాంటి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. పలు కారణాల వల్ల ఆలస్యం జరిగి ఉండవచ్చు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మీ ప్రయోజనాలను తిరిగి పొందేందుకు ప్రాసెస్ ఉంది. అదేంటో చూద్దాం.
ఈకేవైసీ చేసిన రైతులకు మాత్రమే 18వ విడత డబ్బులు జమ అయ్యాయి. ఈ స్కీంలో గోల్ మాల్ నివారించేందుకు అర్హత ఉన్న రైతులు ప్రయోజనాలను పొందేందుకు ప్రభుత్వం ఈకేవైసీ కూడా తప్పనిసరి చేసింది. సొంతసాగు భూమి లేనివారు పీఎం కిసాన్ యోజన పథకానికి అర్హలు. అదేవిధంగా కుటుంబ వార్షిక ఆదాయం ఆదాయపు పన్ను శాఖ నిబంధనలను మించి ఉన్నట్లయితే వారు అర్హులు అవుతారు. ముఖ్యంగా ఈకేవైసీ పూర్తి చేయనివారు కూడా ఈ పథకానికి అనర్హులుగా పరిగణిస్తారు.
పీఎం కిసాన్ స్కీం కోసం లబ్ధిదారులైన రైతులు వెంటనే ఈకేవైసీ పూర్తి చేయడం ముఖ్యం. అదేవిధంగా భూమి ధ్రువీకరణను పొందడం కూడా అవసరం. ఈ పనులు చేపట్టని రైతులు వెంటనే అలర్ట్ అయి ఈ పనులు చేస్తే పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో జమ అవుతాయి.
పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ pmkisan.gov.in లోకి వెళ్లి, ఫార్మర్స్ కార్నర్ లో ఉన్న కొత్త ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి. అక్కడ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, భూమికి సంబంధించిన వివరాలతో పూర్తి సమాచారం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ పూర్తిచేసినా పీఎం కిసాన్ డబ్బు అందనట్లయితే పీఎం కిసాన్ యోజన హెల్ప్ లైన్ నెంబర్స్ 155261, 1800115526 నెంబర్ కు కాల్ చేసిన మీ సమస్యను తెలపాలి. అక్కడి నుంచి వెంటనే పరిష్కారం వస్తుంది.