Supreme Court: ఉచితాలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
Supreme Court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Supreme Court: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉచిత పథకం సంక్షేమ పథకం అని తేల్చేది ఎలా అంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఉచితాల సమస్య జటిలమవుతోందని ఉచిత విద్య, ఉచిత తాగునీరు వాగ్ధానాలు ఉచితాలు కావా అని ప్రశ్నించింది. హామీలను గుప్పించకుండా రాజకీయ పార్టీలను నియంత్రించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమ ప్రభుత్వాల భాధ్యతని, ప్రజా ధనాన్ని సరైన పద్ధతిలో వెచ్చించడమే ఇక్కడ ప్రధాన అంశమని సీజేఐ నొక్కిచెప్పారు.