Free Laptop Distribution Scheme: విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్..ఆన్లైన్ విద్య కోసం ల్యాప్ టాప్ లు

Free Laptop Distribution Scheme: కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని సరైనా మార్గంగా ఎంచుకున్నాయి.

Update: 2020-07-02 08:37 GMT

Free Laptop Distribution Scheme: కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని సరైనా మార్గంగా ఎంచుకున్నాయి. దీనితో ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ విద్యార్థుల పై విద్యాసంస్థ లపైన కూడా పడింది.. ఇప్పటికే కొన్ని పరీక్షలు నిర్వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నింటిని రద్దు చేయగా మరికొన్ని వాటిని వాయిదా వేశాయి. ఇక మళ్లీ స్కూల్స్ , కళాశాలలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి అన్నదానిపై ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో ఆన్లైన్ విద్యకు ప్రాధాన్యత పెరగడంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ విద్యను ప్రోత్సహించేలా ఆ దిశగా అడుగులు వేస్తోంది.

దానికోసం రూ. 15వేల విలువ సాంకేతిక పరికరాలను విద్యార్థులకు అందివ్వాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రతిపాదించింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లకు గానూ రూ. 60 వేల కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా అందజేసింది. అయితే ఈ పథకంలో భాగంగా కేంద్రం వాటా రూ. 36,473 కోట్లు కాగా మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలు భరించాల్సి వస్తుంది. ఈ పథకం ద్వారా మొత్తం 4కోట్ల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. కాగా 2021-22 విద్యా సంవత్సరానికి గాను 1.5 కోట్ల మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

ఇక భారత్ లో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి.. కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 19,148 కేసులు నమోదు కాగా, 434 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం 6,04,641 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,26,947 ఉండగా, 3,59,859 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 17,834 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,29,588 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 90,56,173 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.


Tags:    

Similar News