కేంద్రంతో ముగిసిన రైతు సంఘాల చర్చలు!
రైతు సంఘాలతో కేంద్రం జరిపిన నాల్గో దఫా చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో 7.30 గంటలపాటూ సాగిన సమావేశం ముగిసింది.
రైతు సంఘాలతో కేంద్రం జరిపిన నాల్గో దఫా చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకుండానే ముగిశాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో 7.30 గంటలపాటూ సాగిన సమావేశం ముగిసింది. కీలక అంశాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. అయితే ఎల్లుండి మరో దఫా సమావేశమవ్వాలని ఇరు వర్గాలు నిర్ణయించుకున్నాయి. రైతులతో మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని కేంద్ర వ్యవసాయమంత్రి తోమార్ ప్రకటించారు. గత8 రోజులుగా రాజధాని నడిబొడ్డున రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వణికించే చలిలోనూ వారు పట్టు వీడటం లేదు.. కేంద్రం ఇచ్చిన భోజనాన్ని తిరస్కరించిన రైతులు తమ భోజనాన్ని తామే సమకూర్చుకుంటున్నారు. మరోవైపు రైతుల పాలిట నరకంగా మారిన కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోనందుకు నిరసనగా కేంద్రమాజీ మంత్రిప్రకాష్ సింగ్ బాదల్ తనకు ఇచ్చిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వాపసు ఇచ్చేశారు.