మోదీ ప్రభుత్వంపై రఘురాం రాజన్‌ కీలక వ్యాఖ‌్యలు

దేశ ఆర్థిక వృద్ధి మందగమనం రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌ స్పందించారు. వృద్ధి రేటు పెంచేందుకు దేశంలో కొన్ని సంస్కరణలు తీసుకురావాలని ఆయన అన్నారు.

Update: 2019-12-08 11:37 GMT
రఘురాం రాజన్‌

దేశ ఆర్థిక వృద్ధి మందగమనం రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌ స్పందించారు. వృద్ధి రేటు పెంచేందుకు దేశంలో కొన్ని సంస్కరణలు తీసుకురావాలని ఆయన అన్నారు. క్యాప్టిల్, పెట్టుబడులు, చరాస్తి, స్థిరాస్తి, కార్మిక మార్కెట్లు విషయంలో సంస్కరణలు అవసరమని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆర్థిక వృద్ధి రేటు మందగమనం విషయంలో తప్పు ఎక్కడ జరుగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. ప్రధాని కార్యాలయంలోనే అధికారం కేంద్రీకరణ కావడం ద్వారా దేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు. బ్యాంకేతర కంపెనీలు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయాయని పేర్కొన్నారు

ప్రస్తుతం త్రైమాసికంలో 4.5 శాతానికి వృద్ధిరేటు ఉండడం బాధకరమన్నారు. పోటీతత్వాన్ని పెంచి, దేశీయ సమర్ధతను అభివృద్ది చేసేందుకు‎ వాణిజ్య ఒప్పందాల్లో చేరాలని సూచించారు. సామాజిక, రాజకీయ, అజెండాక ఆర్థిక సంస్కరణలలో ఫలితాలు ఇవ్వడం లేదని అన్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై పెద్దగా అవగాహన ఉండడం లేదని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలు ఆర్థిక సరళీకరణను స్ధిరంగా తీసుకెళ్లాయి. మోదీ ప్రభుత్వం ఆర్థిక మందగమనాన్ని అధికమించేందుకు ముందు దానిని ప్రణాళికను అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఆర్థిక మందగమనం ప్రస్తుతం మాత్రమే అనే ఆలోచన విడనాడాలని సూచించారు. విమర్శలను రాజకీయ కోణంలో చూడకుడదని సరికాదని రఘురాం రాజన్‌ అన్నారు.

Tags:    

Similar News