Pranab Mukherjee Tests Positive: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి కరోనా పాజిటివ్
Pranab Mukherjee Tests Positive: కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు కరోనా సోకగా.. తాజాగా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇక గత కొద్ది రోజులుగా తనతో సంప్రదించిన వారంతా కరోనా టెస్టులు చేసుకోవాలని అభ్యర్థిస్తున్నానని అయన వెల్లడించారు.
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 22 లక్షల 15 వేలు దాటింది. దేశంలో మొత్తం 22,15,075 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,34,945 ఉండగా, 15,35,744 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 44,386 మంది కరోనా వ్యాధితో మరణించారు.