ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అంతిమ యాత్ర ప్రారంభం

Update: 2020-09-01 08:19 GMT

Pranab Mukherjee: అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అంతిమయాత్ర మొదలైంది. కోవిడ్ నిబంధనలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దిల్లీ 10 రాజాజీ మార్గ్‌లోని ఆయన నివాసం నుంచి లోధి శ్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది. అక్కడ సైనిక లాంఛనాలతో ప్రణబ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్ర‌ణ‌బ్‌కు వీడ్కోలు ప‌లికేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు, కాంగ్రెస్ నాయ‌కులు త‌ర‌లివ‌స్తున్నారు.

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆగ‌స్టు 10న ఢిల్లీలోని ఆర్మీ ఆస్ప్ర‌తిలో ప్ర‌ణ‌బ్ చేరిన విష‌యం విదిత‌మే. మెద‌డులో ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌డంతో ఆయ‌న‌కు ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు స‌ర్జరీ చేశారు. ఆ త‌ర్వాత ప్ర‌ణ‌బ్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ క్ర‌మంలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆగ‌స్టు 31న సాయంత్రం ప్ర‌ణ‌బ్ తుదిశ్వాస విడిచారు.

Tags:    

Similar News