Ponguleti: ఢిల్లీ చేరుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Ponguleti: ఇవాళ రాహుల్ గాంధీ, ఖర్గేలతో భేటీ
Ponguleti: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయం కావడంతో జూలై రెండో తేదీ ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీని ఆ సభకు ఆహ్వానించి, ప్రజల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. దీంతో ఢిల్లీ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు, ఎఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఇతర ముఖ్యనేతలను కలిసి ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభకు ఆహ్వానించనున్నారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి బృందం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్ గాంధీతో భేటీకానున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సహా తెలంగాణకి చెందిన నాలుగైదు జిల్లాల కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యాచరణ ఉంటుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో వారి ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి నా నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు..
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నారు.. తెలంగాణలో ఆట మొదలుకాబోతుంది..ఆటను పర్ఫెక్ట్ గా ఆడబోతున్నాం..ఖమ్మంలోనే చేరికలుంటాయని తెలిపారు. కేడర్ అంతా వెంటే ఉందని పేర్కొన్నారు...భవిష్యత్ లో ఇతర పార్టీల నేతలు, ఇతర ప్రాంతాల నేతలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారనే అభిప్రాయం పొంగులేటి శ్రీనివాసరెడ్డిలో వ్యక్తమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదనని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని పొంగులేటి పలుసందర్భాల్లో ప్రస్తావించారు...తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసమే రాజకీయ పునరేరికీకరణ జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.