Vaccine: భారత్ కు విదేశీ టీకాలు..లైన్ క్లియర్

Vaccine: దేశంలో టీకాల కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది

Update: 2021-06-02 08:08 GMT

Foreign Vaccines To India (File image) 

Vaccine: దేశంలో టీకాల కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. విదేశీ టీకాలకు అనుమతి ప్ర్రకియల్లో డీసీజీఐ మార్పులు చేసింది. విదేశాల్లో ఆమోదించిన టీకాలకు భారత్ లో పరీక్షలు అవసరం లేదని స్పష్టం చేసింది. కొన్ని దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన కోవిడ్-19 టీకాలు భారత్ లో బ్రిడ్జ్ ట్రైల్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. డీజీసీఐ చీఫ్ వి.జి.సొమని రాసిన లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలతో కూడా మొదటి నుంచీ సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన చెప్పారు. ఇండియాకు డోసులు పంపినా లేదా ఇక్కడే తయారు చేయాలని అనుకున్నా పార్ట్నర్ కంపెనీలను కూడా సిద్ధం చేస్తామని చెప్పామన్నారు. కాకపోతే దిగుమతి అయ్యే టీకాలు ఆయా దేశాల నేషనల్ కంట్రోల్ లేబరేటరీల ధ్రువీకరణను పొంది ఉండాలని సోమని లేఖలో పేర్కనానరు.

కొవాగ్జిన్ కరోనా టీకా తయారీ ఫార్ములాను ఇతర కంపెనీలకు ఇచ్చేందుకు భారత్ బయోటెక్ కంపెనీ అంగీకరించిందని నీతి ఆయోగ్ మెంబర్ (హెల్త్), నేషనల్ కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పాల్ ప్రకటించారు. అయితే బతికి ఉన్న కరోనా వైరస్ ను ఇనాక్టివేట్ చేసి భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేశాయి. లైవ్ వైరస్ ను బయోసేఫ్టీ లెవల్ (బీఎస్ఎల్) 3 ల్యాబ్ లలో మాత్రమే కల్చర్ చేసి, టీకా తయారు చేసేందుకు వీలవుతుంది. ప్రస్తుతం దేశంలోని ఇతర కంపెనీల్లో ఈ ల్యాబ్స్ లేవు" అని ఆయన తెలిపారు. కొవాగ్జిన్ ఉత్పత్తికి ముందుకు వచ్చే కంపెనీలు బీఎస్ఎల్3 ల్యాబ్, టెక్నాలజీని సమకూర్చుకునేందుకు సహకారం అందిస్తామన్నారు.

రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ కరోనా టీకా వచ్చే వారంలోనే మార్కెట్లోకి రావొచ్చని వీకే పాల్ అన్నారు. ఇప్పటికే స్పుత్నిక్ వీ ఫస్ట్ బ్యాచ్ కింద 1.5 లక్షల వయెల్స్ మే 1న హైదరాబాద్ కు చేరాయని, శుక్రవారం (మే 14) సెకండ్ బ్యాచ్ టీకాలు కూడా రష్యా నుంచి వస్తున్నాయని ఆయన తెలిపారు.

ఈ సంస్థలు భారత్ కు టీకాలు సరఫరా చేశాక వాటిపై ఏమైనా న్యాయపరమైన చిక్కలు, నష్టపరిహారాల అంశాలు వస్తే భారత ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సాధారణంగా టీకాలను విడుదల చేయడానికి ఏళ్లు పడతాయి. ప్రభుత్వాల ఒత్తిళ్ల కారణంగా హడావుడిగా టీకాలు విడుదల చేశారు. దీంతో జరగకూడని ఘటనలు జరిగితే రక్షణ కోసం ఆ సంస్థలు కోరుతున్నాయి. దీనికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నో ఫాల్ట్ పరిష్కారం చెప్పింది. కోవిడ్ వ్యాక్సిన్ల దుష్ర్ఫభావాలు ఏమైన వుంటే బాధితులు కోర్టుకు వెళ్లకుండా పరిహారం అందజేయాలని పేర్కొంది.

Tags:    

Similar News