కేంద్ర మంత్రి జై శంకర్ ఇంట విషాదం
దైర్యం చెప్పిన వారందరికీ మా కుటుంబం ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తుంది" అని జైశంకర్ ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నారు. కాగా సులోచన సుబ్రహ్మణ్యం..
భారత విదేశాంగ శాఖా మంత్రి ఎస్ జైశంకర్ ఇంట విషాదం నెలకొంది. జైశంకర్ తల్లి సులోచన సుబ్రహ్మణ్యం శనివారం కన్నుమూశారు. వయసురీత్యా ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు కుమారులు - జైశంకర్, ఎస్ విజయ్ కుమార్ , సంజయ్ సుబ్రహ్మణ్యం ఉన్నారు. తన తల్లి మరణం గురించి ట్విట్టర్ ద్వారా సమాచారం ఇచ్చారు జైశంకర్, ఈ సందర్భంగా ఆమె చిత్రాన్ని పోస్ట్ చేసి ఈ విధంగా రాశారు. "నా తల్లి సులోచన సుబ్రహ్మణ్యం ఈ రోజు కన్నుమూసిన విషయం గురించి చాలా బాధపడ్డాను. అమ్మ స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు ఆమెను వారి ఆలోచనలలో ఉంచమని కోరుతున్నాము.
తన తల్లి అనారోగ్యం కారణంగా బాధపడుతున్న సమయంలో మాకు దైర్యం చెప్పిన వారందరికీ మా కుటుంబం ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తుంది" అని జైశంకర్ ట్విట్టర్ పోస్టులో పేర్కొన్నారు. కాగా సులోచన సుబ్రహ్మణ్యం భర్త కె సుబ్రహ్మణ్యం 2011 ఫిబ్రవరిలో మరణించారు. ఆయన వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడుగా ఉన్నారు. సులోచన సుబ్రహ్మణ్యం మరణానికి సంతాపం తెలిపిన వారిలో కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు, బిజెపి నాయకుడు రామ్ మాధవ్, నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ ఉన్నారు. పలువురు ప్రముఖులు ట్విటర్ వేదికగా జై శంకర్‌కు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇదిలావుంటే గతంలో విదేశాంగ కార్యదర్శిగా పని చేసి.. మోదీ కేబినెట్‌లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎస్. జైశంకర్ ఆ తరువాత విదేశాంగ మంత్రిగా ఎంపిక అయిన సంగతి తెలిసిందే.