Supreme Court: ఇంకా ఎన్ని తరాలపాటు రిజర్వేషన్లు కొనసాగిస్తారు..?- సుప్రీం కోర్టు
Supreme Court: ఇంకా ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లను కొనసాగిస్తారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
Supreme Court: ఇంకా ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లను కొనసాగిస్తారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మరాఠా రిజర్వేషన్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విద్య, ఉద్యోగాలకు సంబంధించి ఇంకా ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లు కొనసాగుతాయో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది. అంతేకాక రిజర్వేషన్లలో ప్రస్తుతం అమలు చేస్తోన్న 50 శాతం పరిమితిని తొలగించాల్సివస్తే తలెత్తే అసమానతలపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ రిజర్వేషన్ కోటాల విషయాన్ని ఆయా రాష్ట్రాలకు వదిలివేయాలని వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం ఇంకా ఎన్ని తరాలపాటు దీన్ని కొనసాగిస్తారు అని ప్రశ్నించింది.