Flying Taxis: ఎగిరే ట్యాక్సీలు వస్తున్నాయి... గంటల ప్రయాణం ఐదు నిమిషాల్లోనే
Flying Taxis: ఫ్లైయింగ్ ట్యాక్సిలు బెంగుళూరులో అందుబాటులోకి రానున్నాయి. వీటితో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
Flying Taxis: ఫ్లైయింగ్ ట్యాక్సిలు బెంగుళూరులో అందుబాటులోకి రానున్నాయి. వీటితో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ మేరకు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ బెంగుళూరు బీఎల్ఆర్, సరళ ఏవియేషన్ మధ్య అక్టోబర్ 15న ఎంఓయూ కుదిరింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తాయి.
బెంగుళూరులో ట్రాఫిక్ కష్టాలకు చెక్
సార్లా ఏవియేషన్ ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఈవీటీఓఎల్ ఫ్లైయింగ్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకురానుంది. ఒక పైలెట్ తో పాటు ఆరుగురు ప్యాసింజర్లు ఇందులో ప్రయాణం చేయవచ్చు. ప్రయాణీకులు తమ లగేజీని కూడా ఇందులో ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్ల వచ్చు. సంప్రదాయ హెలికాప్టర్ల కంటే ఇవి వేగంగా ప్రయాణీస్తాయి. అర్బన్ ప్రాంతంలో ఇవి గేమ్ ఛేంజర్ గా మారుతాయి.
గంట ప్రయాణం ఐదు నిమిషాల్లోనే
బెంగుళూరు సెంట్రల్ జిల్లా ఇందిరానగర్ నుంచి కెంపెగౌడ విమానాశ్రయానికి 1.5 గంటల సమయం పడుతుంది. అయితే ఈ ఎయిర్ ట్యాక్సీలో 5 నిమిషాల్లో చేరవచ్చు. ఇలా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి నిమిషాల వ్యవధిలోనే తమ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.
ఎంత ఛార్జి చేస్తారు?
బెంగుళూరు ఎయిర్ పోర్ట్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి ఫ్లైయింగ్ ట్యాక్సీలో 19 నిమిషాల్లో చేరుకోవచ్చు. 37.5 కి.మీ. దూరం ఉన్న ఈ మార్గంలో కారులో చేరుకోవాలంట 152 నిమిషాల సమయం పడుతుంది.
ప్రైవేట్ కార్లలో ప్రయాణిస్తే రూ. 2500 ఛార్జీ చేస్తారు. అయితే ఎగిరే ట్యాక్సీ మాత్రం రూ. 1700 వసూలు చేయనుంది.
గంటకు250 కి.మీ. వేగం
ఈ ఎగిరే ట్యాక్సీ గంటకు 250 కి.మీ. వేగంతో ప్రయాణీస్తుంది. గంటల ప్రయాణాన్ని నిమిషాల్లోకి మారుస్తుంది. 20-40 కిలోమీటర్లు అర్బన్ ప్రాంతాల్లో ప్రయాణించేందుకు ఇవి అనుకూలంగా ఉంటాయి. డబుల్ ఐసోలేటెడ్ బ్యాటరీ ప్యాక్ లు నాలుగు ఈ ట్యాక్సీకి ఉంటాయి. 15 నిమిషాల్లోనే ఈ వాహనానికి సంబంధించిన బ్యాటరీలు చార్జీ అవుతాయి. ఇవి హెలికాప్టర్ల కంటే సురక్షితమైనవిగా సార్లా ఏవియేషన్ సంస్థ తెలిపింది.
ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయంటే?
వచ్చే రెండు నుంచి మూడేళ్లలో ఫ్లైయింగ్ ట్యాక్సీలు బెంగుళూరులో అందుబాటులోకి వస్తాయని సార్లా ఏవియేషన్ సంస్థ తెలిపింది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. అంతేకాదు గేమ్ ఛేంజర్ గా మారుతుందని ఆ సంస్థ సీఈఓ అడ్రియన్ ష్మిత్ చెప్పారు.