Nepal: వరదలతో నేపాల్‌లో భీతావహ వాతావరణం

20రోజుల వ్యవధిలో 38మంది మృత్యువాత నీటమునిగిన 790 ఇళ్లు, ధ్వంసమైన వంతెనలు

Update: 2021-07-04 14:32 GMT

నేపాల్ లో వరదలు(ఫోటో : ఎన్ డి టి వి) 

Nepal: కుండపోత వర్షాలు, ఉప్పొంగిన నదులతో నేపాల్‌ అల్లకల్లోలంగా మారింది. బరద బీభత్సానికి తోడు కొండచరియలు విరిగి పడడంతో 20 రోజుల వ్యవధిలోనే 38మంది మృత్యువాత పడ్డారు. ప్రకృతి విలయంతో మరో 50మంది గాయపడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముగ్గురు చిన్నారులు సహా 24 మంది వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో గల్లంతయినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వరద ప్రాంతాల్లో సైన్యం, పోలీసు బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరదలతో మొత్తం 790 ఇళ్లు నీట మునగగా.. చాలా వంతెనలు ధ్వంసమయ్యాయి.

Tags:    

Similar News