డెహ్రాడూన్‌ను తాకిన క్లౌడ్‌బరస్ట్.. వైష్ణోదేవి గుహను చుట్టుముట్టిన వరద.. రంగంలోకి ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు

Heavy Rainfall in Dehradun: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా రాయ్‌పూర్ బ్లాక్‌లో శనివారం తెల్లవారుజామున క్లౌడ్‌బరస్ట్ సంభవించింది.

Update: 2022-08-20 08:30 GMT

డెహ్రాడూన్‌ను తాకిన క్లౌడ్‌బరస్ట్.. వైష్ణోదేవి గుహను చుట్టుముట్టిన వరద.. రంగంలోకి ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు

Heavy Rainfall in Dehradun: ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా రాయ్‌పూర్ బ్లాక్‌లో శనివారం తెల్లవారుజామున క్లౌడ్‌బరస్ట్ సంభవించింది. డెహ్రాడూన్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సమాచారం అందుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ముంపు గ్రామంలో చిక్కుకున్న ప్రజలందరినీ రక్షించారు. కొందరు సమీపంలోని రిసార్ట్‌లో ఆశ్రయం పొందుతున్నట్టు SDRF తెలిపింది.

శుక్రవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా డెహ్రాడూన్‌లోని ప్రసిద్ధ తప్‌కేశ్వర్ మహాదేవ్ ఆలయం సమీపంలో ప్రవహించే తమసా నది భీకరమైన రూపాన్ని సంతరించుకుంది. దీని కారణంగా మాతా వైష్ణో దేవి గుహ యోగ దేవాలయం, తపకేశ్వర్ మహాదేవ్‌ ఆలయాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు అని ఆలయ వ్యవస్థాపకుడు ఆచార్య బిపిన్ జోషి తెలిపారు.

హోటళ్లు రెస్టారెంట్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరదల కారణంగా ఎటూ వెళ్లలేక పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమల్టా మాల్డేవటాలో రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ధాటికి పలుచోట్ల కార్లు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ థామి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పరిశీలించారు.


Tags:    

Similar News