India: పాత నోట్ల రద్దు జరిగి నేటికి సరిగ్గా ఐదేళ్లు
* నల్లధనం కట్టడి లక్ష్యంగా పాత నోట్ల రద్దు * డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించిన కేంద్రం
India: పాత నోట్ల రద్దు జరిగి నేటికి సరిగ్గా ఐదేళ్లు. నల్లధనం కట్టడి, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర సర్కార్ ఐదేళ్ల క్రితం నవంబరు 8న రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేసింన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ కరెన్సీ నోట్ల చలామణి సైతం క్రమంగా పుంజుకుంటున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం నోట్ల రద్దుకు ముందు రూ.17.74 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు చలామణిలో ఉన్నాయి. అక్టోబరు 29, 2021 నాటికి అవి రూ.29.17 లక్షల కోట్లకు పెరిగాయి. కొవిడ్-19 మూలంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ముందుజాగ్రత్తగా నగదు దగ్గర ఉంచుకునేందుకు మొగ్గుచూపుతున్నారు.
దీంతో గత ఆర్థిక సంవత్సరంలో నోట్ల చలామణి పెరిగింది. డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, చెల్లింపు యాప్‌లు ఇలా పలు సాధనాల ద్వారా డిజిటల్ చెల్లింపులు సైతం భారీగా పెరిగాయి. ముఖ్యంగా యూపీఐకి దేశంలో భారీ ఆదరణ లభిస్తోంది.