Rafale Jets to Land Today: కాసేప‌ట్లో భార‌త అమ్ముల పొదిలోకి రాఫెల్‌ యుద్ధ విమానాలు

Rafale Jets to Land Today: దేశం సరిహద్దు వెంబ‌డి ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ ‌నేపథ్యంలో భార‌త్ త‌న అమ్ముల పొదిలోకి బ్రహ్మాస్త్రాలు లాంటి రాఫెల్ యుద్ధ విమానాలు చేర్చుకుంటోంది

Update: 2020-07-29 05:49 GMT
rafale

Rafale Jets to Land Today: దేశం సరిహద్దు వెంబ‌డి ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ ‌నేపథ్యంలో భార‌త్ త‌న అమ్ముల పొదిలోకి బ్రహ్మాస్త్రాలు లాంటి రాఫెల్ యుద్ధ విమానాలు చేర్చుకుంటోంది. శత్రువు దేశాల‌ గుండెల్లో గుబులు పుట్టించ‌డానికి .. ఫ్రాన్స్ నుంచి భారత్‌కు శ‌ర‌వేగంగా ఎగిరివస్తున్నాయి. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న రాఫెల్ ఫైటర్ జెట్లు మ‌రికాసేట్లో భారత్‌లోని అంబాలా ఏయిర్‌ఫోర్స్ స్టేషన్ చేరనున్నాయి. రాఫెల్ యుద్ధ జెట్లతో భారత వైమానిక దళంలో స‌రికొత్త అధ్యాయ‌నం ప్రారంభ‌మ‌వుతుంది. శత్రు దేశాల దాడుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టగ‌లం.

ఫ్రాన్స్‌లోని దస్సాల్ట్ ప్రొడక్షన్ యూనిట్ లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ యుద్ధ విమానాలు సోమవారం టేకాఫ్ అయిన సంగతి తెలిసింది. మ‌రికొద్ది గంట‌ల్లో భారత్‌కు చేరుకోనున్నాయి. ఈ మధ్యాహ్నానికి హర్యానాలోని అంబాలాలో గల భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్‌బేస్ స్టేషన్‌లో ల్యాండ్ కాబోతున్నాయి. ఈ జెట్ ఫైటర్స్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వైమానిక దళాధినేత రాకేష్ కుమార్ భడౌరియా సహా పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలకనున్నారు. ఈ సందర్భంగా అంబాలాలో భారీ ఆంక్షలు విధించారు. అక్క‌డ‌ నో ఫ్లై జోన్ ( No Fly Zone ) ప్రకటించారు. అంతేకాకుండా చుట్టుపక్కల 4 గ్రామాల్లో సెక్షన్ 144 విధించారు. జనం గుమిగూడకుండా...ఇళ్ల మిద్దెలపైకెక్కి ఫోటోలు తీయడం, వీడియో తీయడాన్ని సైతం పూర్తిగా నిషేధించారు.

ప్ర‌త్యేక‌త‌లు

 ట్విన్ ఇంజిన్స్‌ గల రాఫెల్ యుద్ధ విమానాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందాయి. రాఫేల్ విపణులను రెక్కల కింద దాచుకుని శత్రువులను చీల్చి చెండాడుతుంది. ఒకేసారి ఉపరితలం నుంచి ఉపరితలానికి, గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఇవి ప్రయోగించగలవు. దీని మిస్సైల్ టార్గెట్‌పై నిప్పులు కురిపిస్తుంది. మానవ చూపును మించిన సామర్థ్యం కలిగి ఉండి శత్రువులను మట్టుబెడుతుంది. రాడార్ వార్నింగ్ రిసీవర్లతో పాటు అతి తక్కువ స్థాయిలో ఉండే జామర్ల సిగ్నళ్లను కూడా పసిగట్టగలవు. ఈ జెట్లు ఒక్కసారి ఇంధనాన్ని నింపుకొంటే.. నిర‌వ‌ధికంగా 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించ‌గ‌ల‌దు. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగ‌ల‌డం దీని ప్ర‌త్యేక‌త‌. ఈ విషయం ఇప్పటికే రుజువైంది కూడా. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో అతి శీతల పరిస్థితుల్లో కూడా ఈ విమానాలు లక్ష్యాన్ని ఛేదించగలవు.

ఒకేసారి తొమ్మిది టన్నుల ఎక్స్‌టర్నల్ బరువును అవలీలగా మోయగల సత్తా రాఫెల్ యుద్ధ విమానాలకు ఉన్నాయి. నౌకాదళానికి చెందిన సామాగ్రిని 13 టన్నుల వరకు మోయగలవు. సైడ్ విండర్, అపాచి, హర్పూర్, అలారం, పీజీఎం 100, మేజిక్ అండ్ మైకా వంటి యుద్ధ సామాగ్రిని ఇవి అత్యంత వేగంగా గమ్యస్థానానికి చేర్చగలవు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించే సత్త ఉన్న స్కాల్ప్ మిస్సైల్స్‌ను సంధించడానికి రాఫెల్ యుద్ధ విమానాల్లో ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.

ఒక నిమిషంలో 2500 రౌండ్ల పాటు కాల్పులు జరపగల 30 ఎంఎం క్యానన్‌ను ఇవి సంధించగలవు. 15.30 మీటర్ల పొడవుతో.. రాఫెల్ యుద్ధ విమానాల పొడవు 15.30 మీటర్లు. దీని రెక్కల పొడవు 10.90 మీటర్లు. ఎత్తు 5.30 మీటర్లు. దీని బరువు 10 టన్నులు. టేకాఫ్ తీసుకునే సమయంలో 24.5 టన్నుల బరువును ఇవి మోయగలవు. ఇంధన ట్యాంకు సామర్థ్యం 4.7 టన్నులు. 6.7 టన్నుల వరకు ఇంధన బరువును మోయగలవు. ఇలాంటి అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ జెట్ విమనాల తయారీ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ 58 వేల కోట్ల రూపాయలు. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. 

Tags:    

Similar News