Rafale Jets For India: ఎల్లుండి భారత్‌కు రానున్న 5 రఫెల్ యుద్ధ విమానాలు

Update: 2020-07-27 08:09 GMT

Rafale Jets For India: భారత వైమానిక దళం (ఐఎఎఫ్) కొనుగోలు చేసిన ఐదు రాఫెల్ ఫైటర్ జెట్ల మొదటి బ్యాచ్ జూలై 29న భారత్‌ చేరనున్నాయి.. వారు యుఎఇ నుండి ఐదు రఫేల్‌ యుద్ధ విమానాలు ఎల్లుండి భారత్‌లోని అంబాలా వైమానికి స్థావరానికి చేరతాయని సమాచారం. దీంతో ఈ విమానాలను బుధవారం ఐఎఎఫ్‌లోకి చేర్చనున్నారు అధికారులు. భారత దేశానికి బయలుదేరే ముందు యూఏఈలోని ఎయిర్‌బేస్‌లో ఫ్రాన్స్‌ వైమానికి దళానికి చెందిన ట్యాంకర్‌ విమానం ద్వారా ఇంధనం నింపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఫ్రాన్స్‌లోని భారత రాయబారి జావేద్ అష్రాఫ్ దీనిపై మాట్లాడుతూ.. "ఈ ఐదు రాఫెల్ జెట్‌లు చాలా వేగంగా, బహుముఖ మరియు అధిభూతమైన విమానాలని అన్నారు. సమయానికి విమానాలను పంపిణీ చేసినందుకు డసాల్ట్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. ఫ్రెంచ్ ప్రభుత్వం భారత వైమానిక దళానికి ఎప్పుడు మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ఈ కొత్త రాఫెల్స్ యుద్ధ విమానాలు భారతదేశ వైమానిక పోరాట సామర్థ్యాలకు బలాన్ని చేకూరుస్తున్నాయని అన్నారు. కాగా ఈ రఫేల్ యుద్ధ విమానాలను నడిపేందుకు భారత వైమానిక దళ సిబ్బందికి ఫ్రాన్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. భారత దేశం కోసం 36 రఫేల్ యుద్ధ విమానాల తయారీకి భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాలు 2016లో ఒప్పంద అంగీకారం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పందంపై అప్పట్లో ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశాయి.   

Tags:    

Similar News