అమర్‌నాథ్ యాత్రకు మొదటి బ్యాచ్.. యాత్రకు వెళ్లిన 3వేల మంది భక్తులు..

Amarnath Yatra: రేపటి నుంచి ప్రారంభమయ్యే పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు ఇవాళ ఫస్ట్ బ్యాచ్ బయలుదేరి వెళ్లింది.

Update: 2022-06-29 09:02 GMT

అమర్‌నాథ్ యాత్రకు మొదటి బ్యాచ్.. యాత్రకు వెళ్లిన 3వేల మంది భక్తులు..

Amarnath Yatra: రేపటి నుంచి ప్రారంభమయ్యే పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు ఇవాళ ఫస్ట్ బ్యాచ్ బయలుదేరి వెళ్లింది. కోవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమయింది. హర హర మహాదేవ్ నినాదాల మధ్య అమర్‌నాథ్ యాత్రికుల మొదటి బ్యాచ్ జమ్మూ నుంచి కశ్మీర్ లోయకు బయలుదేరింది. అమర్‌నాథ్ యాత్రికుల మొదటి బ్యాచ్‌ను జమ్మూలోని యాత్రి నివాస్ భవన్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. తెల్లవారు జామున 3వేల మందికి పైగా యాత్రికులు కశ్మీర్ లోయకు వెళ్లారు.

యాత్రకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్రికులకు C.R.P.F‌కు చెందిన కమెండోలు ఎస్కార్ట్ నిర్వహిస్తున్నారు. భారత్, పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. యాత్రికులు ప్రయాణించే వాహనాలకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌లు జోడించారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రను సురక్షితంగా, సాఫీగా నిర్వహించేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

Tags:    

Similar News