Fire Accident in Mumbai Borivali Area: ముంబైలోని బోరివాలి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
Fire Accident in Mumbai Borivali Area: ముంబైలోని బోరివాలి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ( జూలై 11 ) 3.05 గంటలకు బోరివాలి వెస్ట్‌లోని దత్తాపాదలో ఉన్న ఇంద్రప్రస్థ షాపింగ్ సెంటర్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది
Fire Accident in Mumbai Borivali Area: ముంబైలోని బోరివాలి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ( జూలై 11 ) 3.05 గంటలకు బోరివాలి వెస్ట్‌లోని దత్తాపాదలో ఉన్న ఇంద్రప్రస్థ షాపింగ్ సెంటర్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భారీగా ఆస్తినష్టం సంభవించింది. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది భారీ ఎత్తున ఫైర్ ఇంజన్ లతో అక్కడికి చేరుకుంది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి అగ్నిమాపక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రమాదంపై చీఫ్ ఫైర్ ఆఫీసర్, ప్రభాత్ రహంగ్‌డేల్ మాట్లాడుతూ.. మొదట ఉదయం 3.54 గంటలకు అగ్ని తీవ్రత పెరిగింది.. ఇది ఉదయం 6.16 నాటికి మరింత తీవ్రమైంది. ఇప్పుడు అది లెవల్ 4 కి చేరిందని అన్నారు.
షాపింగ్ కేంద్రంలో ఒక-స్థాయి బేస్మెంట్, గ్రౌండ్ , రెండు పై అంతస్తులు ఉన్నాయి. అయితే మంటలు మాత్రం మొదటి అంతస్థు లోపే పరిమితం అయ్యాయి.. దట్టమైన పొగలు వ్యాపించడంతో మొదటి అంతస్థు లో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వారు దగ్గులు, తుమ్ములతో అస్వస్థతకు గురయ్యారు. జెసిబి సహాయంతో బేస్మెంట్ యొక్క సైడ్ గ్రిల్స్ తొలగించేసి లోపల వెంటిలేషన్ పనులు చేపట్టారు. మంటలను అదుపు చెయ్యడానికి 14 ఫైర్ ఇంజన్లు , 13 జంబో ట్యాంకర్లు అక్కడే ఉన్నాయి. ఫైర్ టెండర్లతో పాటు, పొగను బయటికి పంపడానికి ఎగ్జాస్ట్ బ్లోవర్ ను ఉపయోగిస్తున్నారు.