ఈశాన్య రాష్ట్రాలను భయపెడుతోన్న కార్చిచ్చు
* నాగాలాండ్‌లోని జుకోవు లోయ నుంచి మణిపూర్‌కు వ్యాపించిన మంటలు
ఈశాన్య రాష్ట్రాలను కార్చిచ్చు భయపెడుతోంది. నాగాలాండ్‌లోని జుకోవు లోయలో నాలుగు రోజుల క్రితం అంటుకున్న దావానలం రోజురోజుకూ పెరుగుతోంది. లోయలోని చెట్లు దగ్ధమవుతున్నాయి.
ఇక ఈ మంటలు కాస్తా మణిపూర్‌లోని సేనాపతి జిల్లా అడవులకు వ్యాపించింది. దీంతో మణిపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంటలను అదుపుచేసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, సైన్యం సాయం కోరింది. అటు కార్చిచ్చు పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అటు నాగాలాండ్ ప్రభుత్వం హెలికాప్టర్ల సాయంతో మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తోంది.