Covid-19 Hospital: కోవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, 4గురి మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
Covid-19 Hospital: కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించి నలుగురు మృత్యువాత పడ్డారు. చాలామంది గాయపడ్డట్టు సమాచారం.
Covid-19 Hospital: చాపకింద నీరులా తన్నుకొస్తున్న కరోనా సెకండ్ వేవ్ కు పట్టపగ్గాలు లేకుండా పోయింది. అందునా కరోనా కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన నాగపూర్ లోని కోవిడ్ 19 ఆసుప్రతిలో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కరోనా రోగులు అగ్నికి ఆహుతయ్యారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 27 మంది పేషెంట్లను ఇతర ఆస్పత్రులకు తరలించారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడే ఏమి చెప్పలేమని పోలీసులు తెలపడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. వివరాల ప్రకారం.. నాగపూర్ వాడి ప్రాంతంలోని ఓ కోవిడ్ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రి ఐసీయూలోని ఏసీ యూనిట్ లో సాంకేతిక లోపం కారణంగా తొలుతగా మంటలు వచ్చినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సెకండ్ ఫ్లోర్ లోని ఐసీయూలో మొదలైన మంటలు ఇతర ఫ్లోర్ లకు మంటలు వ్యాపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నాగపూర్ లో జరిగిన అగ్నప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ కీలక నేత దేవెంద్ర ఫడ్నవీస్ ఈ ఘటన విషయమై ట్వీట్ చేశారు. నాగపూర్ లోని ఆస్పత్రిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందన్న విషయం బాధ కలిగించిందన్నారు. ఈ విషయమై నాగపూర్ కలెక్టర్ తో మాట్లాడినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ ప్రమాదంపై ట్విట్టర్‌లో స్పందించారు. నాగ్‌పూర్ కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం గురించి తెలిసి చాలా బాధేసింది.. వెంటనే కలెక్టర్‌తో మాట్లాడాను.. అవసరమైన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.. అంటూ ఆయన ట్విట్ చేశారు.