తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని విరుద్‌నగర్‌లోని బాణసంచా కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.