West Bengal: సువేందు అధికారిపై ఎఫ్ఐఆర్
West Bengal: బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి, అతని సోదరిడి పై కేసు నమోదు
West Bengal: పశ్చిమ బెంగాల్ లో రాజకీయ వేడెక్కుతోంది. తుపాను రివ్యూ మీటింగ్ రాకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానికే షాకిచ్చింది. దీంతో సీఎస్ ను రీకాల్ చేయడం వంటి త్వరత్వరగా జరిగి పోయాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికల ముందు తృణమూల్ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకుని, ప్రస్తుతం ప్రతిపక్ష నేత అయిన సువేందు అధికారిపై కేసు నమోదైంది.
పూర్తి వివరాల్లోకి వెళితే...కంతి మున్సిపాలిటీ నుంచి లక్షల విలువైన వస్తు సామాగ్రిని దొంగతనం చేశారనే ఫిర్యాదు మేరకు సువేందు అధికారి, అతని సోదరుడు సౌమేందు అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కంతి మునిసిపల్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డ్ సభ్యుడు రత్నదీప్ మన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కంతి పోలీసులు వెల్లడించారు.
రత్నదీప్ మన్నా ఈ నెల 1న ఫిర్యాదు చేయగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. మే 29న సువేందు అధికారి, మాజీ కంతి మున్సిపాలిటీ చీఫ్ సౌమేందు అధికారి.. కంతి కార్యాలయ గోడౌన్‌లోకి బలవంతంగా, అక్రమంగా చొరబడి లక్షలు విలువచేసే సామాగ్రిని దోచుకెళ్లారని అని మన్నా తెలిపారు. దొంగతనంలో బీజేపీ నేతలు కేంద్ర సాయుధ బలగాలను సైతం ఉపయోగించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.