Mohan Lal: లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సినీ నటుడు మోహన్ లాల్

Mohan Lal: వయనాడ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో మోహన్ లాల్ పర్యటన

Update: 2024-08-04 06:30 GMT

Mohan Lal: లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సినీ నటుడు మోహన్ లాల్

Mohan Lal: వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సినీ నటుడు మోహన్ లాల్ పర్యటించారు. వయనాడ్‌లో నిన్న పర్యటించిన మోహన్ లాల్... బాధితులను ఆదుకునేందుకు విశ్వశాంతి ఫౌండేషన్‌కు 3 కోట్ల రూపాయల భారీ విరాళం అందించారు. వయనాడ్ పరిధిలోని మెప్పాడిలోని ఆర్మీ క్యాంపు వద్దకు చేరుకున్న మోహన్ లాల్, అధికారులతో కొద్దిసేపుచర్చించి కొండచరియలు విరిగిన పడిన మండలానికి వెళ్లారు. టెరిటోరియల్ ఆర్మీ క్యాంపును సందర్శించి సహాయకచర్యలు చేపడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సైనిక దుస్తుల్లో ఉన్న ఆయన తనవంతుగా సేవలు అందించారు. మోహన్ లాల్ ఆర్మీ దుస్తుల్లో ఎందుకు వచ్చారనేది ఓ ప్రశ్న అయితే... లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఎందుకు ఇచ్చారనేది మరో ప్రశ్న..

వయనాడ్‌లోని కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని సందర్శించిన మోహన్ లాల్ ఆర్మీ డ్రెస్‌లో అధికారులతో మాట్లాడుతూ కనిపించారు. మోహన్‌లాల్ నిజంగానే ఆర్మీ ఆఫీసరా అనే డౌట్ అందరికీ వచ్చింది. మోహన్ లాల్ ఆర్మీ ఆఫీసరే... మన భారత సైన్యంలో పదాతి దళంలో కీలకంగా పనిచేస్తున్నారు. 2009లో మోహన్ లాల్‌కి టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ పదవిని ప్రధానం చేశారు. వయనాడ్ బాధిత ప్రాంతాలకు ఆయన లెఫ్టినెంట్ కల్నల్ హోదాలోనే వెళ్లి... బాధితులను పరామర్శించారు. భారత సైన్యంలోని 122 టెరిటోరియల్ ఆర్మీలో భాగంగా ఆయన లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో విపత్తుతో దెబ్బతిన్న ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ అనేది రెగ్యులర్ ఇండియన్ ఆర్మీ తర్వాత రెండవ రక్షణ శ్రేణి. టెరిటోరియల్ ఆర్మీ అనేది భారత సైన్యానికి సహాయక సేవలను అందించే పార్ట్ టైం వాలంటీర్లతో కూడిన మిలిటరీ రిజర్వ్ ఫోర్స్. ఇందులో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లు ఇతర సిబ్బంది ఉంటారు. వీరు భారత సైన్యంలోని వారితో సమానమైన ర్యాంక్‌లను కలిగి ఉంటారు. విధుల్లో సైన్యానికి ప్రత్యామ్నాయంగా పనిచేయడం, ప్రకృతి వైపరీత్యాలు, అవసరమైన సేవల నిర్వహణలో పౌరులకు సహాయం చేయడం, అవసరమైనప్పుడు సాధారణ సైన్యానికి యూనిట్లను టెరిటోరియల్ ఆర్మీ అందిస్తుంది. ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో దాదాపు 40 వేల మందికిపైగా ఉన్నారు.

1948 టెరిటోరియల్ ఆర్మీ యాక్ట్ ద్వారా TA ఏర్పాటు చేశారు. TAలో చేరాలనుకునే వ్యక్తులు తప్పనిసరిగా ఏదైనా ఉద్యోగం కానీ స్వయం ఉపాధి కాని ఉండి తీరాలి. సేవ చేసే ఉద్దేశం ఉన్న వారందరినీ టెరిటోరియల్ ఆర్మీలోకి తీసుకోరు. వారికి సైతం పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం తీసుకుంటారు. టెరిటోరియల్ ఆర్మీ అనేది పార్ట్‌టైమ్ కాన్సెప్ట్, ఇది సంవత్సరంలో రెండు నెలల పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News