Sanitizers వాడుతున్నారా? ఆ తొమ్మిది శానిటైజర్లు వెంట‌నే ఆపేయండి!

Sanitizer Recall List: క‌రోనా వైర‌స్ దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తుంది. ఈ మ‌హమ్మారిని అడ్డుకోవ‌డానికి వ్యాక్సిన్ ఒక్క‌టే మార్గం.

Update: 2021-05-27 07:26 GMT

శానిటైజర్ (Representational image)

FDA Sanitizer Recall List 2021: క‌రోనా వైర‌స్ దేశ‌వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తుంది. ఈ మ‌హమ్మారిని అడ్డుకోవ‌డానికి వ్యాక్సిన్ ఒక్క‌టే మార్గం. దేశంలోని ప్ర‌తి ఒక్క‌రికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే అంతా తొంద‌ర‌గా ముగిసే ప్ర‌క్రియ కాదు. అయితే అప్ప‌టి వ‌ర‌కు క‌రోనాపై పోరాటం చేయ‌డానికి మ‌న‌కి ఒక్క‌టే దారి. భౌతిక దూరం పాటించ‌డం. మాస్క్ వేసుకోవడం, చేతులను పదేపదే శుభ్రపరచుకోవడం 20సెకన్ల పాటు సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

కానీ మ‌నం వెళ్లిన ప్ర‌తి చో్ట‌కి స‌బ్బు, నీరు తీసుకెళ్ల‌లేం. అందుకే శానిటైజర్ల వాడకం పెరిగిపోయింది. కరోనా సోకకుండా శానిటైజర్లను వాడుతూ..మన ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నాం. శానిటైజర్లు క్రిములను నాశనం చేస్తాయి కానీ మనం వాడే ప్రతి శానిటైజర్ మంచిది కాదని తేల్చింది. కొన్ని శానిటైజర్లు విష ప్రభావాన్ని కలిగి ఉన్నాయని ఇటీవల FDA ప్రకటించింది. మెక్సికోలో తయారుచేయబడ్డ ఈ శానిటైజర్లలో ఎక్కువ శాతం మిథనాల్ కలపడం మూలంగా అవి విషప్రభావాన్ని కలిగి ఉంటాయి. అధిక స్థాయిలో మిథనాల్ ఉన్న 9 హ్యాండ్ శానిటైజర్లను ఇటీవల FDA గుర్తించింది.. ఆ తొమ్మిది శానిటైజర్లు ఏవేవో తెలుసుకొని మీరు కనుక వాటిని వాడుతున్నట్టైతే జాగ్రత్తగా ఉండండి..

ఆ తొమ్మిది శానిటైజర్లు ఇవే 

సానిడెర్మ్ అడ్వాన్స్డ్ హ్యాండ్ శానిటైజర్ (Saniderm Advanced Hand Sanitizer)

ఆల్-క్లీన్ హ్యాండ్ శానిటైజర్ (All clean hand sanitizer)

గుడ్ జెల్ యాంటీ బాక్టీరియల్ హ్యాండ్ శానిటైజర్ ( Good gel anti bacterial hand sanitizer)

క్లీన్‌కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 75% ఆల్కహాల్ ( Clean care no germ adwanced hand sanitizer)

క్లీన్‌కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 80% ఆల్కహాల్ (లాట్ నంబర్ 74589-005-03) ( Clean care no germ adwanced hand sanitizer)

క్లీన్‌కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 80% ఆల్కహాల్ (లాట్ నంబర్ 74589-003-01) ( Clean care no germ adwanced hand sanitizer)

ఎస్క్ బయోకెమ్ హ్యాండ్ శానిటైజర్ (Esk biochem hand sanitizer)

క్లీన్‌కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 70% ఆల్కహాల్ ( clean care adwanced hand sanitizer)

లావర్ 70 జెల్ హ్యాండ్ శానిటైజర్ (Lavar 70 gel hand sanitizer)

శానిటైజర్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

వైరస్ ను అడ్డుకోవాలంటే శానిటైజర్ ఆల్కహాల్ ఆధారితమై ఉండాలి. నాసిరకం శానిటైజర్ల వలన కొత్త సమస్యలు తెచ్చుకోవడం కంటే మంచి బ్రాండ్ శానిటైజర్ నే వినియోగించడం మేలు. శానిటైజర్ కొనేముందు ఖచ్చితంగా అందులో ఆల్కహాల్ శాతం ఎంత ఉందనేది లేబుల్ చూసి చెక్ చేసి తీరాల్సిందే. అయితే హ్యాండ్ శానిటైజర్లలో వాల్యూమ్ ప్రకారం కనీసం 94.9 శాతం ఇథనాల్ ఉండాలి అని ఎఫ్‌డిఎ చెబుతోంది.

యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ-వైరల్ లక్షణాలను కలిగి ఉన్న ఒకదాన్ని ఎంచుకోండి మరియు 60 నుండి 70 శాతం ఆల్కహాల్ కలిగి ఉండాలి. శానిటైజర్ ను ఎల్లపుడూ చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి.చాలా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లు ఎక్స్పైరీ డేట్ తో వస్తాయని గుర్తుంచుకోండి. ఎందుకంటే కాలక్రమేణా ఆల్కహాల్ ఆవిరైపోతుంది మరియు ఆల్కహాల్ ఆవిరి అయిపోయినట్టైతే మీరు శానిటైజర్ వాడినా దాని ప్రభావం క్రిములపై ఏ మాత్రం ఉండదు. అది ఇథనాల్ / ఇథైల్ ఆల్కహాల్ లేదా ఐసోప్రొపైల్ / ఐసోప్రొపనాల్ ఇలా రకరకాల ఆల్కహాల్ లు ఉండొచ్చు. వాటిల్లో ఇథైల్ ఆల్కహాల్ సురక్షితమైనది. సిడిసి మార్గదర్శకాల ప్రకారం, కనీసం 60 శాతం ఇథనాల్ , 70 శాతం ఐసోప్రొపనాల్ సురక్షితం.

మెథనాల్ అనేది విషంతో సమానం..దీనివలన వికారం, మైకము, స్పృహ కోల్పోవడం, అలసట కలుగుతాయి. కంటిచూపు అస్పష్టంగా ఉంటుంది .కొన్ని సార్లు ఇది అంధత్వానికి మరియు మరణానికి కూడా దారితీయవచ్చు..ముఖ్యంగా ఇది పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు ఎక్కువ హానికరం. మరొక పెద్ద ప్రమాదం ఏంటంటే..శానిటైజర్ ఉపయోగించి మంట ఉన్న చోటికి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ..కాబట్టి ఇళ్లల్లో వంటగదిలో పనిచేసే మహిళలు శానిటైజర్ వాడకపోవడమే ఉత్తమం.

Tags:    

Similar News