Bihar: ఘోరప్రమాదం.. 9 మంది మృతి

Bihar: అదుపుతప్పి ముందు వెళ్తున్న బైకును ఢీకొన్న జీపు

Update: 2024-02-26 04:00 GMT

Bihar: ఘోరప్రమాదం.. 9 మంది మృతి

Bihar: బిహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కైముర్‌ జిల్లాలో ట్రక్కు, జీపు ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న జీపు, ముందు వెళ్తున్న ఒక ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఈ రెండు వాహనాలు అదుపుతప్పి మరో మార్గంలోకి వెళ్లాయి. అదే సమయంలో వేగంగా వస్తున్న ట్రక్కు ఈ రెండు వాహనాలను ఢీకొట్టింది.

దీంతో జీపులో ఉన్న ఎనిమిది మందితో పాటు, ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రక్కు డ్రైవర్‌ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ట్రక్కును సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదపై సీఎం నీతీశ్‌ కుమార్‌ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Tags:    

Similar News