జనవరి 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ప్రకటన

జనవరి 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ప్రకటన

Update: 2020-12-26 01:50 GMT

దేశ వ్యాప్తంగా టో‌ల్‌ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే.. ఇటీవల వాహనాలంటికి ఇది ఉండాల్సిందేనని కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. జనవరి 1 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ ప్రకటన చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఫాస్టాగ్ వసూళ్లపై స్పష్టంగా కనిపించింది.

తాజాగా ఫాస్టాగ్ ద్వారా రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే జరిగిన 50 లక్షల లావాదేవీల ద్వాకరా 80 కోట్ల రూపాయలు వసూళ్లు అయ్యాయి. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో రావడం ఇదే తొలిసారని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. 

Tags:    

Similar News