దేశ వ్యాప్తంగా అమల్లోకి ఫాస్టాగ్

* టోల్‌ప్లాజాల దగ్గర ఫాస్ట్‌గా వెళ్తున్న వాహనాలు * ఇక నుంచి అన్ని లైన్లు ఫాస్టాగ్‌గా మార్పు * నిన్నటితో ముగిసిన ఫాస్టాగ్ కొనుగోళ్లకు గడువు

Update: 2021-02-16 00:50 GMT

ఫస్టాగ్ ఇమేజ్ 

దేశ వ్యాప్తంగా టోల్ ప్లాజాలు దాటాలంటే ఖచ్చితంగా ఫాస్టాగ్ ఉండాల్సిందే. వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలు. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపై ఫాస్టాగ్ లేకుంటే వాహనదారులకు మోత తప్పదు. ఒకవేళ ఫాస్టాగ్ లేకపోతే రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

 మరోవైపు ఫాస్టాగ్ కొనుగోళ్లకు నిన్నటితో గడువు ముగిసింది. డిజిటల్ పేమెంట్లు తప్పనిసరి చేసింది. ముందుగా ఈ ఏడాది జనవరి 1 నుంచే ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా.. ఈ నెల 15వరకు గడువు పొడిగించింది. అయితే ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని ఇక అవకాశాలివ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

Full View


Tags:    

Similar News